బీహార్‌లో(Bihar) అనుకోని విపత్తు జరిగింది.

బీహార్‌లో(Bihar) అనుకోని విపత్తు జరిగింది. మహావీర్‌ మేళా(Mahaveer mela) సందర్భంగా నిర్వహించిన ఓ నృత్య ప్రదర్శనలో ఉన్నట్టుండి రూఫ్‌(Roof collapse) కూలింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం సరన్‌ జిల్లాలో మంగళవారం రాత్రి ఇషావ్‌పూర్‌(Ishavpur) బ్లాక్‌లో మహావీర్‌ అఖారా ఊరేగింపు జరిగింది. ఈ కార్యక్రమానికి వేలాది మంది వచ్చారు. అక్కడ జరుగుతున్న డాన్స్‌ ప్రోగ్రామ్‌ను చూసేందుకు చాలా మంది భవనాల పైకప్పుల పైకి ఎక్కారు. ఇదే సమయంలో శిథిలావస్థకు చేరిన ఓ ఇంటిపైకప్పు అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ఘటనతో జనం భయభ్రాంతులకు గురయ్యారు. అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ క్రమంలో అక్కడ తొక్కిసలాట జరిగింది. వందలాది మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. గాయపడినవారిని సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. పది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. రూఫ్‌ కూలుతున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Eha Tv

Eha Tv

Next Story