హత్యకు గురైన వ్యక్తి మృతదేహం(Dead body) దగ్గర వాసన(smell) చూసిన పోలీస్‌ డాగ్‌(Police dog) వర్షాన్ని సైతం లెక్క చేయలేదు.

హత్యకు గురైన వ్యక్తి మృతదేహం(Dead body) దగ్గర వాసన(smell) చూసిన పోలీస్‌ డాగ్‌(Police dog) వర్షాన్ని సైతం లెక్క చేయలేదు. జోరుగా వర్షం కురుస్తున్నా ఎక్కడా ఆగకుండా పరుగెత్తింది. వ్యక్తిని హత్య చేసిన నిందితుడే మరో మహిళను హత్య చేస్తున్న గ్రామంలోని నేరుగా ఆ ఇంటికే తీసుకెళ్లింది. ఆ సమయంలో మహిళను కొట్టి చంపేందుకు ప్రయత్నిస్తున్న నిందితుడిని పట్టుకొని ఆమెను కాపాడారు పోలీసులు. వివరాల్లోకి వెళ్తే..

కర్నాటకలోని(karnataka) దావణగెరె(davanagere) జిల్లాలో సంతబెన్నూరులోని పెట్రోలు బంక్‌ సమీపంలో ఒక వ్యక్తి హత్యకు గురయ్యాడు. గురువారం రాత్రి 9.45 గంటల సమయంలో మృతదేహాన్ని గస్తీ పోలీసులు గమనించారు. సమాచారాన్ని జిల్లా ఎస్పీకి ఇచ్చారు పోలీసులు. వెంటనే స్పందించిన ఎస్పీ ప్రశాంత్‌(SP Prashanth) పోలీస్‌ డాగ్‌ తుంగ-2తో(Tunga-2) పాటు దాన్ని హ్యాండిల్‌ చేసే కానిస్టేబుల్ షఫీ, ఇతర పోలీస్‌ సిబ్బందిని వెంటనే ఘటనా స్థలానికి పంపించారు. ఈ డాగ్‌ మృతదేహం వద్ద వాసన చూసింది. హంతకుడిని గుర్తించేందుకు ఇక అక్కడి నుంచి పరుగందుకుంది. ఆ సమయంలో జోరుగా వర్షం కూడా కురుస్తున్నా లెక్క చేయలేదు. అంతటి జడివానలో కూడా 8 కి.మీ.దూరం పరుగెత్తింది. అదే జిల్లా చన్నాపురా గ్రామానికి చేరిన డాగ్ ఓ ఇంటి దగ్గర ఆగి గట్టిగా అరిచింది. పోలీసు బృందం వెంటనే ఆ ఇంటి తలుపులు బద్దలు కొట్టి మహిళను కొట్టి చంపుతున్న హంతకుడిని అరెస్ట్ చేశారు. మహిళను వెంటనే ఆస్పత్రికి తరలించారు. హత్యగావింపబడ్డ వ్యక్తిని సంతోష్‌ (33)గా గుర్తించారు. తన భార్యతో సంతోష్‌కు వివాహేతర సంబంధం ఉందన్న ఆగ్రహంతో అతనిని చంపినట్లు తెలిసింది. సంతోష్‌ను చంపిన తర్వాత నేరుగా ఇంటికి చేరుకుని భార్య రూపను దారుణంగా కొట్టి చంపబోతుండగా పోలీస్‌ డాగ్‌ కాపాడిందని, తుంగ-2 సాహసాన్ని అభినందించారు.

Eha Tv

Eha Tv

Next Story