తమిళనాడులో(Tamilnadu) రాజకీయాలు, సినిమాలు వేర్వేరుగా ఉండవు.

తమిళనాడులో(Tamilnadu) రాజకీయాలు, సినిమాలు వేర్వేరుగా ఉండవు. సినిమా వాళ్లకు రాజకీయాలతో సంబంధం ఉంటుంది. ప్రతీ ఒక్కరికి ఏదో ఒక పార్టీతో అనుబంధం ఉంటుంది. ఏ పార్టీ నచ్చని వారు సొంతంగా ఓ పార్టీ పెట్టేసుకుంటారు. ఇప్పటికే చాలా మంది హీరోలు సొంత పార్టీలు పెట్టుకున్నారు. ఎంజీఆర్‌ నుంచి మొదలు పెడితే శివాజీగణేశన్‌, కమలహాసన్‌, విజయకాంత్‌, కార్తిక్‌ ఇలా అందరూ పార్టీలు పెట్టుకున్నవారే. కొందరు సక్సెసయ్యారు. కొందరు ఎటూ కాకుండా పోయారు. ఇప్పుడు స్టార్‌ హీరో దళపతి విజయ్‌(Vijay thalapthy) స్థాపించిన తమిళగ వెట్రి కళగం(Tamilaga Vettri Kazhagam) పార్టీ ఏ మేరకు విజయం సాధిస్తుందో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తేలిపోతుంది. అయితే రాజకీయాల్లోకి వస్తున్నానని విజయ్‌ ప్రకటించగానే తమిళనాడులో ప్రకంపనలు రేగిన మాట మాత్రం నిజం. తమిళనాడులోని ప్రధానపార్టీలకు విజయ్‌ పార్టీ గట్టి పోటీనిస్తుందని చాలామంది భావిస్తున్నారు.

ఇక ఈ రోజు తమిళగ వెట్రి కళగం పార్టీ జెండాను(Party Flag), ఎన్నికల గుర్తును విజయ్‌ ఆవిష్కరించారు. ఎరుపు పసుపు రంగులతో ఉన్న ఆ జెండా మధ్యలో రెండు ఏనుగుల బొమ్మలున్నాయి. జెండా అట్రాక్టివ్‌గానేఉంది. కాకపోతే ఎంతవరకు ఇది జనాల్లోకి వెళుతుందనేది చూడాలి.




Updated On 22 Aug 2024 5:46 AM GMT
Eha Tv

Eha Tv

Next Story