Delhi Election Results 2025 : ఢిల్లీలో ఆప్ ఓటమికి కారణాలేంటి..!
దాదాపు మూడు దశాబ్దాల తర్వాత దేశ రాజధానిలో బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చింది.

దాదాపు మూడు దశాబ్దాల తర్వాత దేశ రాజధానిలో బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చింది. మూడో సారి హ్యాట్రిక్ కొడుతామని కేజ్రీవాల్ చెప్పుకొచ్చినా ఫలితాలు తారుమారయ్యాయి. అసలు ఆప్ ఓడిపోడానికి కారణాలేంటో ఓ సారి విశ్లేషించుకుంటే..!
యమునా విషం గురించి అరవింద్ కేజ్రీవాల్ చేసిన హామీ నిలబెట్టుకోలేయారన్న అపవాదు ఆప్‌పై ఉంది. యమునా నది(Yamuna River)ని శుభ్రం చేస్తానని ఆయన పదే పదే వాగ్దానం చేసినప్పటికీ, నది భారీగా కలుషితమవుతోంది. AAP 2015 మేనిఫెస్టో కూడా 100% మురుగునీటి శుద్ధి, నదిని శుభ్రపరచడానికి కట్టుబడి ఉంది, కానీ ఆ దిశగా సఫలం కాలేకపోయారు. ఎన్నికలకు ముందు ఢిల్లీ(Delhi) నీటి సరఫరాకు అంతరాయం కలిగించేందుకు బీజేపీ నేతృత్వంలోని హర్యానా ప్రభుత్వం యమునా నదిని కలుషితం చేస్తోందని కేజ్రీవాల్ ఆరోపించడంతో ఇది ఓటర్లకు నచ్చలేదు. కేజ్రీవాల్ వాదనలను కొట్టిపారేయడానికి హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ యమునా నీటిని కూడా తాగారు, AAPని విమర్శించారు మరియు తన రాష్ట్రం నుంచి ఢిల్లీకి ప్రవహించే నీటిలో విషం లేదని నొక్కి చెప్పారు.
ఇక మరో అంశం 'షీష్ మహల్' వివాదం రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్(Arvind kejriwal) అవకాశాలను గణనీయంగా దెబ్బతీసి ఉంటుంది. ఆయన నాయకత్వంపై దాడి చేయడానికి బీజేపీ ఈ సమస్యను ఉపయోగించుకుంది. ఇది బీజేపీ ప్రచారంలో కేంద్రంగా మారింది.
లిక్కర్ పాలసీ స్కామ్‌లో అరవింద్ కేజ్రీవాల్ ప్రమేయం కూడా 2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో అతని అవకాశాలను తీసిందని విశ్లేషణ. ఈ వివాదం ఓటర్లను దూరం చేసినట్లు తెలుస్తంఓది. న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానంలో బీజేపీకి చెందిన పర్వేశ్ వర్మ, కాంగ్రెస్ అభ్యర్థి సందీప్ దీక్షిత్‌లపై కేజ్రీవాల్ పోటీ చేశారు. వర్మ ఢిల్లీ మాజీ సీఎం సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు కాగా, దీక్షిత్ ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ కుమారుడు. కేజ్రీవాల్ కీలక వాగ్దానాలను నెరవేర్చలేక పోతున్నారని వర్మ విమర్శించారు. కేజ్రీవాల్ తన వాగ్దానాలతో ఓటర్లలో ఆయనకున్న విశ్వసనీయత దెబ్బతీసింది. 2013లో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ఆప్ తొలిసారిగా ఆవిర్భవించినప్పటికీ, కీలక హామీలను నెరవేర్చడంలో విఫలమైంది. 2015లో, AAP ఉచిత విద్యుత్, నీరు, మెరుగైన విద్య వాగ్దానాలపై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది, అయితే కొన్ని ఉచితాలను పక్కన పెడితే, అభివృద్ధి పరిమితంగానే ఉంది.
మొహల్లా క్లినిక్‌లు మరియు మెరుగైన పాఠశాలలు తీర్చిదిద్దినప్పటికీ ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా BJP, ఈ వాదనలను తిప్పికొట్టాయి. AAP పనిచేయకపోవడం, అవకతవకలకు పాల్పడిందని ఆరోపించింది. పైప్‌డ్ వాటర్ కనెక్షన్‌లు, కాలుష్యం తగ్గింపు వంటి వాగ్దానాలు నెరవేరలేదు. 2023 "రోజ్‌గార్ బడ్జెట్" కూడా దాని ఉద్యోగ సృష్టి కల్పనలో విఫలమైందనేది విశ్లేషణ.
