ఉగ్రవాదాన్ని(terorrism)భారత్‌(india)సహించబోదని, ఉగ్రవాదులను సమూలంగా ఏరిపారేస్తామని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ (rajnath singh) అన్నారు. అవసరమైతే పాకిస్తాన్‌ (pakistan) భూభాగంలోకి చొచ్చుకువెళ్లి మరీ ఉగ్రవాదులను మట్టుపెడతామని హెచ్చరించారు.

ఉగ్రవాదాన్ని(terorrism)భారత్‌(india)సహించబోదని, ఉగ్రవాదులను సమూలంగా ఏరిపారేస్తామని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ (rajnath singh) అన్నారు. అవసరమైతే పాకిస్తాన్‌ (pakistan) భూభాగంలోకి చొచ్చుకువెళ్లి మరీ ఉగ్రవాదులను మట్టుపెడతామని హెచ్చరించారు. భారతదేశానికి ఆ సామర్థ్యం ఉందని చెప్పారు. పాకిస్తాన్‌ ఆ విషయాన్ని గుర్తిస్తే మంచిదన్నారు. బ్రిటన్‌కు చెందిన గార్డియన్‌ పత్రిక పాకిస్తాన్‌లో ఉగ్రవాదుల మరణానికి సంబంధించి ఓ కథనాన్ని ప్రచురించింది. దానికి రియాక్టవుతూ రాజ్‌నాథ్‌ సింగ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. గార్డియన్‌ ఏం రాసిందంటే.. విదేశాల్లోని ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్‌లో భాగంగా పాకిస్థాన్‌లో ముష్కరులను భారత ఇంటర్నేషనల్‌ నిఘా ఏజెన్సీ హత్యలు చేస్తోంది. ఖలిస్థానీలను కూడా టార్గెట్‌గా చేసుకుంది. నరేంద్రమోదీ రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విదేశాల్లో ముఖ్యంగా పాకిస్థాన్‌లో భారత వ్యతిరేకులుగా భావిస్తున్న వారిని హతమార్చే కొత్త ధోరణి మొదలైంది. 2020 నుంచి 2023 వరకు దాదాపు 20 మంది ఈ విధంగా ప్రాణాలు కోల్పోయారు. ఈ హత్యలన్నీ భారత గూఢచార సంస్థ ‘రీసెర్చ్‌ అండ్‌ ఎనాలిసిస్‌ వింగ్‌’ (రా) పర్యవేక్షణలో జరిగాయి. ఈ మేరకు భారత్‌, పాకిస్థాన్‌ నిఘా, గూఢచార సంస్థల అధికారులతో మా పత్రిక ప్రతినిధి మాట్లాడి వివరాలు సేకరించారు అంటూ ఓ పెద్ద స్టోరీనే ప్రచురించింది గార్డియన్‌. అయితే, ఈ హత్యల్లో తమ ప్రమేయం లేదని, ఇది భారత వ్యతిరేక దుష్ప్రచారమని భారత విదేశాంగశాఖ పేర్కొన్నదని గార్డియన్‌ తెలిపింది.

Updated On 5 April 2024 11:48 PM GMT
Ehatv

Ehatv

Next Story