పెళ్లికి వయసుతో సంబంధం ఏముంటుంది? పరస్పరం ఇష్టపడితే పరిణయానికి వయసు అడ్డంకి ఉండదు కదా! కాకపోతే తోడు కోసం కొందరు పెళ్లి చేసుకుంటారు. కొందరు అవసరార్థం వివాహం చేసుకుంటారు. 60 ఏళ్ల అశోక్‌ మహతో(Ashok Mahto) ఇలాంటి కోవకే చెందుతాడు. ఈయన మాజీ గ్యాంగ్‌స్టర్‌.

పెళ్లికి వయసుతో సంబంధం ఏముంటుంది? పరస్పరం ఇష్టపడితే పరిణయానికి వయసు అడ్డంకి ఉండదు కదా! కాకపోతే తోడు కోసం కొందరు పెళ్లి చేసుకుంటారు. కొందరు అవసరార్థం వివాహం చేసుకుంటారు. 60 ఏళ్ల అశోక్‌ మహతో(Ashok Mahto) ఇలాంటి కోవకే చెందుతాడు. ఈయన మాజీ గ్యాంగ్‌స్టర్‌. ఇతడిపై చాలా కేసులున్నాయి. 17 ఏళ్లు జైల్లో ఉన్నాడు. లాస్టియరే జైలు నుంచి బయటకు వచ్చాడు. చాలా మంది నేరస్తుల్లాగే ఇతడికి కూడా రాజకీయాల మీద మోజు ఏర్పడింది. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని తహతహలాడుతున్నాడు. ఇందుకోసం ముంగేర్‌ లోక్‌సభ స్థానాన్ని ఎంచుకున్నాడు. గత ఎన్నికల్లో జేడీయూ నేత లాలన్‌ సింగ్ ఇక్కడ్నుంచి విజయం సాధించాడు. ఈసారి కూడా ఆయనే పోటీ చేస్తున్నారు. అశోక్‌ మహతో పోటీ చేద్దామనుకుంటున్నాడు కానీ అది సాధ్యమయ్యేలా లేదు. రాష్ట్రీయ జనతాదళ్‌ సపోర్ట్‌ ఉన్నప్పటికీ టికెట్‌ దక్కే ఛాన్స్‌ లేదు. కారణం అన్నేళ్లు జైలు శిక్ష అనుభవించి రావడంతో పాటు కొన్ని కేసులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. అంచేత చట్టపరంగా ఇతడు పోటీచేయడానికి అనర్హుడు. సలహాలు, సూచనలు ఏమైనా ఇస్తారేమోనని బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌(Lalu Prasad Yadav)ను కలిశారు. అశోక్‌కు లాలు ఓ చక్కటి సలహా ఇచ్చాడు. పెళ్లి చేసుకుని నీ భార్యను ఎన్నికల బరిలో దింపు అని లాలూ సలహా ఇచ్చారు. ఈ సలహా అతడికి బాగా నచ్చేసింది. వెంటనే ఢిల్లీకి చెందిన 46 ఏళ్ల కుమారి అనితను పాట్నా శివారులో ఉన్న ఓ గుడిలో కుటుంబ సభ్యులు, తన మద్దతుదారుల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. తనకో మార్గాన్ని చూపించిన లాలూ ఆశీర్వాదం తీసుకోవడానికి వధూవరులిద్దరూ ఆయన ఇంటికి వెళ్లారు. లాలూ-రబ్రీదేవిల ఆశీర్వాదం తీసుకున్నాడు. ఇంటి నుంచి బయటకు రాగానే మీడియా అశోక్‌ చుట్టుముట్టింది. రకరకాల ప్రశ్నలు వేసింది. ఎన్నికల్లో మీరు నిల్చుంటారా? మీ భార్యను నిల్చోబెడతారా? లాలూ ఏమైనా హామీ ఇచ్చారా? టికెట్ ఇస్తానని చెప్పారా? ఈ వయసులో, అదీ ఇంత హడావిడిగా పెళ్లి ఎందుకు చేసుకున్నారు? ఇలాంటి ప్రశ్నలన్నీ వేశారు. అశోక్‌ చాలా నింపాదిగా, చాలా తెలివిగా 'లాలూ ప్రసాద్‌ ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చాం. ఆ దంపతులు మనస్ఫూర్తిగా మమ్మల్ని ఆశీర్వదించారు. అది చాలు' అని అంటూనే 'ప్రజల ఆశీర్వాదం ఉంటే తప్పకుండా ఆర్జేడీ నుంచే పోటీ చేస్తాం. అని చెప్పి అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. అశోక్‌ మహతో మీద చాలా కేసులున్నాయని చెప్పుకున్నాం కదా! షేక్‌పురా నియోజకవర్గం(Sheikhpura Assembly constituency) జేడీయూ ఎమ్మెల్యే రణధీర్‌ కుమార్‌ సోనీపై హత్యా ప్రయత్నం ఆరోపణలు ఉన్నాయి. నవాదా జైలు బద్దలు కొట్టిన కేసులో కూడా ఇతడు నేరస్థుడే!

Updated On 21 March 2024 12:52 AM GMT
Ehatv

Ehatv

Next Story