జొమాటో(Zomato) డెలివరీ బాయ్స్‌(Delivery boys) వింత వింత పనులు చేస్తున్నారు.

జొమాటో(Zomato) డెలివరీ బాయ్స్‌(Delivery boys) వింత వింత పనులు చేస్తున్నారు. డెలివరీ చేయాల్సిన ఫుడ్‌ను సగం తినడం చూశాం. ఫుడ్‌ తిన్న తర్వాత నాణ్యత లేని ఆహారాన్ని పెట్టడంలాంటి పనులు ఈ మధ్య కాలంలో జొమాటో, స్విగ్గీ బాయ్స్‌కు అలవాటైంది. అయితే ఇక్కడ ఓ యువతికి విచిత్ర అనుభవం ఎదురైంది. జొమాటో డెలివరీ బాయ్ చేసిన షాకింగ్ పని వల్ల ఓ యువతి షాక్‌కు గురైంది. ఫుడ్ డెలివరీ చేయడానికి వచ్చిన ఆ వ్యక్తి తన మర్మాంగం చూపిస్తూ(dick) నాకేదైనా సాయం చేస్తారా అని అడిగాడు. అహ్మదాబాద్‌లో(Ahmedabad) ఈ వింత ఘటన చోటు చేసుకుంది. అహ్మదాబాద్‌కు చెందిన యువతికి కాఫీ తాగాలన్న కోరిక పుట్టింది. భారీ వర్షం కూడా రావడంతో బయటకు వెళ్లలేకపోయింది. ఇంట్లో కరెంట్‌ కూడా లేదు. ఈ సమయంలో కాఫీని జొమాటోలో ఆర్డర్‌ పెట్టుకుంది. రాత్రి కూడా 11 గంటల ప్రాంతంలో డెలివరీ బాయ్‌ వచ్చి బెల్‌ కొట్టాడు. ఆర్డర్‌ ఎందుకు ఆలస్యమైందని అడగడంతో వెటకారంగా సారీ అని చెప్పాడు. పర్వాలేదులే అని చెప్పి యువతి కాఫీని తీసుకొని లోపలికి వెళ్తుండగా ఆమెను ఆపాడు. అంతేకాకుండా తన కాలికి గాయమైందని కాస్త సాయం చేయాలని చెప్పాడు. దీంతో సానుభూతితో యువతి టార్చ్‌ లైట్‌ వేసి తన కాలికి వేయగా 'మర్మాంగం' చూపిస్తూ వికృతంగా వ్యవహరించాడు. దీంతో ఒక్కసారిగా షాక్‌ తిన్న యువతి లోపలికి వెళ్లి తలుపు వేసుకుంది. వెంటనే సోషల్‌ మీడియాలో డెలివరీ బాయ్‌ వ్యవహారంపై సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది. జొమాటో సంస్థకు అతనిపై ఫిర్యాదు చేసింది. ఇంట్లో నుంచి ఆర్డర్‌ పెట్టుకున్నా కూడా ఆడపిల్లలకు రక్షణ లేదని, ఆడపిల్లలకు లైంగిక వేధింపులు తప్పడం లేదని ఆవేదన చెందుతూ పోస్ట్ చేసింది.

Eha Tv

Eha Tv

Next Story