ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి(YS Jagan) సినిమావాళ్లకు నచ్చరా? సినిమావాళ్లకు అనుకూలురు కారనా? లేక తమ కులం వాడు కాదనా? అసలేందుకు జగన్మోహన్‌రెడ్డిని తెలుగు సినిమావాళ్లు దూరం పెడుతున్నారు? ఈ ప్రశ్నలకు ప్రముఖ తెలుగు కవి, సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు చక్కగా, వివరణాత్మకంగా సమాధానాలు ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి(YS Jagan) సినిమావాళ్లకు నచ్చరా? సినిమావాళ్లకు అనుకూలురు కారనా? లేక తమ కులం వాడు కాదనా? అసలేందుకు జగన్మోహన్‌రెడ్డిని తెలుగు సినిమావాళ్లు దూరం పెడుతున్నారు? ఈ ప్రశ్నలకు ప్రముఖ తెలుగు కవి, సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు చక్కగా, వివరణాత్మకంగా సమాధానాలు ఇచ్చారు. ఆయన ఏమన్నారంటే 'ఆంధ్రప్రదేశ్‌ నుంచి సినిమా పరిశ్రమకు దాదాపు 60 శాతం రెవెన్యూ వస్తున్నది. ఆంధ్రప్రదేశ్‌లో షూటింగ్‌లు సున్నా శాతం. పవన్‌కల్యాణ్‌(Pawan kalyan) ఇక్కడ్నుంచి అక్కడికి వెళ్లి జనసేన పార్టీ(Janasena) పెట్టారు. నందమూరి బాలకృష్ణ(Nandhamuri Balakrishna) టీడీపీ తరపున రెండుసార్లు అక్కడ్నుంచే ఎమ్మెల్యే అయ్యారు. మూడోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సినిమా పరిశ్రమలో ఉంటున్న వీరితో పాటు మిగతా వారు కూడా పదే పదే ఏమంటున్నారంటే, జగన్మోహన్‌రెడ్డిగారు మీరు రాష్ట్రానికి ఏ పరిశ్రమలు తీసుకొచ్చారు? ఇలా ప్రశ్నించడం మంచిదే. సంతోషించదగ్గదే.. కానీ మీరున్న పరిశ్రమను మీరు ఎందుకు ఆంధ్రప్రదేశ్‌కు(Andhra Pradesh) తీసుకెళ్లడం లేదు? నాకు రోజుకు రెండు కోట్ల రూపాయలు పారితోషికంగా వస్తుంది అని పవన్‌ ఇంతకు ముందు చెప్పుకున్నారు. అంటే అందులో 60 శాతం ఏపీ నుంచే వస్తున్నది కదా! ఓ సినిమాలో నటిస్తే ఏపీ నుంచి మీకు కోటి 60 లక్షల రూపాయలు వస్తున్నాయన్నమాట! లాభాలు వస్తున్నాయనే కదా నిర్మాతలు మీకు అంతంత ముట్టచెబుతున్నారు. అయిదు కోట్ల ఏపీ ప్రజలు మీకు నీరాజనాలు పలుకుతున్నారు. ఏపీ ప్రజల అభిమానం మీకు కావాలి. 60 శాతం రెవెన్యూ మీకు కావాలి. మీరు పరిశ్రమలు ఏమి తెచ్చారంటూ జగన్మోహన్‌రెడ్డిని ప్రశ్నిస్తారు.

మీ పరిశ్రమను మీరెందుకు అక్కడికి తీసుకెళ్లే ప్రయత్నం చేయరు. నేను ఏమంటున్నానంటే 50 శాతం షూటింగ్‌లైనా ఏపీలో జరగాలి. ఏపీలో షూటింగ్‌ జరుపుకున్న చిత్రాలకు ప్రోత్సాహాకాలు అందిస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చెప్పినా మీరు అక్కడ షూటింగ్‌లు ఎందుకు జరపడం లేదు? ఆంధ్రప్రదేశ్‌ పట్ల మీ చిత్తశుద్ధి ఏ పాటిదో అర్థమవుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగు సినిమా ఆంధ్రప్రదేశ్‌లో షూటింగ్‌లు జరుపుకోవాలి. కనీసం 50 శాతం సినిమానైనా అక్కడ తీయాలి. మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టమంటూ మనం ఏ సింగపూర్‌వాడినో, ఏ అమెరికా వాడినో బతిమాలుకుంటున్నాం. మౌలిక వసతులు కల్పిస్తామంటున్నాం. భూమి, నీరు ఇస్తామని చెబుతున్నాం. వారు ఇక్కడికి వచ్చి అంతా చూసుకుని ఓ రకమైన పోజులిస్తుంటారు. అది మనకు అవసరమా? మీరు నటించే సినిమాల్లో 50 శాతం వరకు ఏపీలోనే షూటింగ్ జరపాలని మీరు నిర్మాత దర్శకులకు చెబితే వారు కాదంటారా? హీరో చెబితే కాదనే ధైర్యం వారికి ఉంటుందా? ఏపీ అభివృద్ధిలో మీ వంతు పాత్ర ఉండొద్దా? మీరు జగన్‌ను ప్రశ్నించే ముందు మీరు కూడా పెట్టుబడుల విషయంలో ముందుకు రావాలి. ఇందుకు నేను ఓ సూచన చేశాను. నా సూచనను నిపుణులు, వ్యాపారరంగాలవారు దాన్ని మరింత అద్భుతం చేయవచ్చు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సరిహద్దులో గరికపాడు అనే పట్టణం ఉంది. అక్కడ వంద ఎకరాలలో ఓ ఫిల్మ్‌ సిటీ(Film City) నిర్మించవచ్చు. ప్రభుత్వం భూమి ఇస్తే కట్టడానికి వంద మంది రెడీగా ఉన్నారు. ఎల్.బి.నగర్ రింగ్‌(LB Nagar) రోడ్డు నుంచి రెండున్నర గంటల్లో గరికపాడుకు చేరుకోవచ్చు. రామోజీ ఫిలింసిటీలో మధ్యాహ్నం వరకు షూటింగ్‌లు చేసుకున్నా సాయంత్రానికి గరికపాడుకు వెళ్లిపోవచ్చు. ఇందువల్ల తెలంగాణకు వచ్చే నష్టమేమీ ఉండదు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో ఫిలిం ఇన్సిటిట్యూట్(Film Institute) లేదు. అక్కడే 30 ఎకరాలలో పుణే ఫిలిం ఇన్సిటిట్యూట్‌ వంటిది బ్రహ్మండంగా నిర్మించవచ్చు. ఎంతసేపూ అగ్రకులాల వారే హీరోలు కావాలా? వేరేవారు కాకూడదా? ఫిలిం ఇన్సిటిట్యూట్‌ వల్ల ఇతర కులాల వారు కూడా నటులయ్యే అవకాశం ఉంటుంది' అని జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు చెప్పుకొచ్చారు. ఆయన ఇంకా చాలా చాలా చెప్పారు. ఆయన ఇంకా ఏమి చెప్పారో ఈ వీడియోలో చూడండి..

Updated On 30 May 2024 12:40 AM GMT
Ehatv

Ehatv

Next Story