అంటే అన్నారంటారు కానీ తెలుగుదేశం పార్టీ(TDP) అనుకూల మీడియా చేష్టలు చూస్తుంటే చీదరం కలుగుతోంది. చంద్రబాబునాయుడు(Chandrababu), ఆయన పుత్రరత్నం లోకేశ్‌(Nara Lokesh) మనసెరిగి ప్రవర్తిస్తుంటాయి పచ్చ పత్రికలు. సందర్భం లేకపోయినా సరే, సందర్భాలను సృష్టించుకుని మరీ భజన చేస్తుంటాయి. మొన్నామధ్య లోకేశ్‌ బ్లూ షర్ట్ వేస్తే ఏం రాతలు రాశాయో అందరూ చూశారు.

అంటే అన్నారంటారు కానీ తెలుగుదేశం పార్టీ(TDP) అనుకూల మీడియా చేష్టలు చూస్తుంటే చీదరం కలుగుతోంది. చంద్రబాబునాయుడు(Chandrababu), ఆయన పుత్రరత్నం లోకేశ్‌(Nara Lokesh) మనసెరిగి ప్రవర్తిస్తుంటాయి పచ్చ పత్రికలు. సందర్భం లేకపోయినా సరే, సందర్భాలను సృష్టించుకుని మరీ భజన చేస్తుంటాయి. మొన్నామధ్య లోకేశ్‌ బ్లూ షర్ట్ వేస్తే ఏం రాతలు రాశాయో అందరూ చూశారు. అదలా ఉంచితే జూనియర్‌ ఎన్టీఆర్‌(Jr NTR) అంటే చంద్రబాబు(Chandrababu), లోకేశ్‌లకు విపరీతమైన కోపం.. అది కోపం కాదు, ఈర్ష్యతో కూడిన భయం. చంద్రబాబు, లోకేశ్‌లకు జూనియర్‌ ఎన్టీఆర్‌ నచ్చడు కాబట్టి సహాజంగానే పచ్చ మీడియాకు కూడా నచ్చడు. తారక్‌ గురించిన వార్తలు, ఫోటోలు రాకుండా జాగ్రత్త పడుతుంటాయి పత్రికలు. మంగళవారం ఎన్‌.టి.రామారావు జయంతి కదా! ఎప్పటిలాగే ఎన్టీఆర్‌ కుటుంబసభ్యులు, కొందరు ప్రముఖులు హైదరాబాద్‌లో ఉన్న ఆయన ఘాట్‌కు వెళ్లి నివాళులు అర్పించారు. జూనియర్‌ ఎన్టీఆర్‌, తన సోదరుడు కల్యాణ్‌రామ్‌తో(Kalyan Ram) కలిసి వెళ్లి నివాళులు అర్పించారు. విచిత్రమేమిటంటే నందమూరి బాలకృష్ణ, దగ్గుబాటి పురంధేశ్వరి దంపతులకు ఇచ్చిన కవరేజ్‌ ఎల్లో మీడియా జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌లకు ఇవ్వలేదు.

పత్రికల్లో ఫోటో కూడా లేదు. లక్ష్మీపార్వతికి ఎలాగూ చోటు కల్పించనుకోండి. అది వేరే విషయం. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి, ఆయన పదవిని, పార్టీని లాగేసుకున్నవారికి మాత్రం బోల్డంత ప్రాధాన్యం లభిస్తుంటుంది. ఎన్టీఆర్‌ను గద్దె నుంచి దించడంలో చంద్రబాబుకు ప్రధానపాత్ర అయితే ఆయనకు పూర్తిగా అండదండలు అందించింది దగ్గుబాటి వెంకటేశ్వరరావు, నందమూరి బాలకృష్ణ అన్న విషయం జగద్విఖ్యాతం. కుటుంబసభ్యులు చేసిన ద్రోహాన్ని తల్చుకుని కుంగిపోయి, ఆ ఆవేదనతోనే ఎన్టీఆర్‌ కన్నుమూశారు. ఇది కూడా అందరికీ తెలిసిన విషయమే. ఎవరైతే ఎన్టీఆర్‌ చావుకు కారకులో వారే ఇప్పుడు ఎన్టీఆర్‌పై పొగడ్తలు కురిపిస్తున్నారు. ఎన్టీఆర్‌ అంతటి వాడు లేడని చెబుతున్నారు. ప్రజానాయకుడని కీర్తిస్తున్నారు. ఇవన్నీ ఎల్లో మీడియాలో వస్తాయి. జూనియర్‌ ఎన్టీఆర్‌ను మాత్రం తప్పిస్తాయి. లోకేశ్‌ దక్షత ఏమిటో, జూనియర్‌ ఎన్టీఆర్‌ సత్తా ఏమిటో అందరికీ తెలుసు. రేపొద్దున పార్టీని జూనియర్‌ ఎక్కడ లాగేసుకుంటాడోనన్న భయం చంద్రబాబుది! అయినా అందరూ తనలాగే చేస్తారని చంద్రబాబు అనుకోవడమే తప్పు. జూనియర్‌ ఎన్టీఆర్‌ను పక్కకు తప్పించడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నారు చంద్రబాబు. ఈ క్రమంలోనే తనవారితో జూనియర్‌ను తిట్టిస్తున్నారు. టీడీపీతో జూనియర్‌ ఎన్టీఆర్‌కు సంబంధం ఏమిటనే టీడీపీ ముఖ్యులు ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ అంటున్నారు. దీని వెనుక చంద్రబాబు ఉన్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తారక్‌ అంటే చంద్రబాబు భయపడుతున్నారనడానికి తాత‌కు నివాళుల‌ర్పించిన జూనియ‌ర్ ఎన్టీఆర్‌ ఫొటోను కూడా అక్కడి నుంచి తొలగించడమే నిదర్శనం.

Updated On 29 May 2024 12:27 AM GMT
Ehatv

Ehatv

Next Story