సినీ ప్రియులకు యాషికా ఆనంద్‌ను(Yashika Anand) మర్చిపోలేరు. గ్లామరస్ పాత్రల్లో యాషికా ఆనంద్ ప్రేక్షకులను అలరించారు. కవలై వేండామ్(Kavalai Vendam) సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే ఫేమ్ అయ్యారు. తర్వాతిరుట్టు అరైయిల్ మురట్టు కుత్తు, ధ్రువంగల్16, నోటా, జాంబీ వంటి సినిమాల్లో నటించారు. తమిళ బిగ్‌బాస్ రియాలిటీ గేమ్‌లో పార్టిసిపేట్ చేసి తమిళ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. కొన్నాళ్ల ముందు స్నేహితులతో కలిసి కారులో వెళుతున్నప్పుడు యాషికా ఆనంద్ ప్రమాదానికి గురయ్యింది.
సినీ ప్రియులకు యాషికా ఆనంద్‌ను(Yashika Anand) మర్చిపోలేరు. గ్లామరస్ పాత్రల్లో యాషికా ఆనంద్ ప్రేక్షకులను అలరించారు. కవలై వేండామ్(Kavalai Vendam) సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే ఫేమ్ అయ్యారు. తర్వాతిరుట్టు అరైయిల్ మురట్టు కుత్తు, ధ్రువంగల్16, నోటా, జాంబీ వంటి సినిమాల్లో నటించారు. తమిళ బిగ్‌బాస్ రియాలిటీ గేమ్‌లో పార్టిసిపేట్ చేసి తమిళ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. కొన్నాళ్ల ముందు స్నేహితులతో కలిసి కారులో వెళుతున్నప్పుడు యాషికా ఆనంద్ ప్రమాదానికి గురయ్యింది. ఆ ప్రమాదంలో యాషికా ఆనంద్‌కు తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రాణాలతో పోరాడారు. మూడు నెలలు ఆసుపత్రిలోనే ఉన్నారు. నెమ్మదిగా కోలుకున్నారు. ఇప్పుడు మామూలు మనిషయ్యారు. మళ్లీ మేకప్ వేసుకోవడానికి రెడీ అయ్యారు. ఈ మధ్యనే సిల నేరంగళిల్ సినిమాలో నటించిన యాషికా ఆనంద్ ప్రస్తుతం ఇవన్ దాన్ ఉత్తమన్, రాజభీమ, పాంబాట్టం మొదలైన సినిమాలలో నటిస్తూ బీజీగా ఉన్నారు. లేటెస్ట్‌గా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు(Youtube Channel) ఆమె ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో చాలా విషయాలు చెప్పుకొచ్చారు. 17 ఏళ్ల వయసులోనే తమిళ సినిమాలో నటించానని చెప్పారు. అలాంటి గ్లామర్ పాత్రలలో నటిస్తే, నిజ జీవితంలోనూ అలాగే ఉంటారని కొందరు అనుకుంటారని, చాలా నీచమైన కామెంట్స్ చేస్తుంటారని, నెగటివ్‌గా మాట్లాడుతుంటారని యాషికా ఆనంద్ ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వ్యాఖ్యలు తనను అమితంగా బాధించినప్పటికీ తనను అసహ్యించుకునే వారికి దూరంగా ఉంటూ , తనను చూసి ఎంజాయ్ చేయమని చెబుతానని యాషికా అన్నారు. కారు ప్రమాదం తర్వాత తన జీవితమే మారిపోయిందని అన్నారు. నిద్రలేని రాత్రులను గడిపానని, రెప్పవాలిస్తే చాలు ప్రమాద సంఘటన కళ్ల ముందు కదలాడేదని అన్నారు. ఆసుపత్రి బెడ్‌పైన ఉన్నప్పుడు మళ్లీ నటిస్తానని అసలు అనుకోలేదని యాషికా ఆనంద్ అన్నారు.