హృతిక్‌ రోషన్‌(Hrithik Roshan), టైగర్‌ ష్రాఫ్‌(Tiger shroff) హీరోలుగా నటించిన సినిమా వార్‌(War). 2019లో రిలీజైన ఈ స్పై థ్రిల్లర్‌ మూవీ భారీ విజయాన్ని సాధించింది. బాక్సాఫీసు దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా వార్‌ 2(War 2) రాబోతున్నది. బ్రహ్మాస్త్ర సినిమా దర్శకుడు అయాన్‌ ముఖర్జీ(Ayaan Murkherjee) ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్‌(NTR) కూడా నటిస్తున్నాడు.

హృతిక్‌ రోషన్‌(Hrithik Roshan), టైగర్‌ ష్రాఫ్‌(Tiger shroff) హీరోలుగా నటించిన సినిమా వార్‌(War). 2019లో రిలీజైన ఈ స్పై థ్రిల్లర్‌ మూవీ భారీ విజయాన్ని సాధించింది. బాక్సాఫీసు దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా వార్‌ 2(War 2) రాబోతున్నది. బ్రహ్మాస్త్ర సినిమా దర్శకుడు అయాన్‌ ముఖర్జీ(Ayaan Murkherjee) ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్‌(NTR) కూడా నటిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను నిర్మాణ సంస్థ యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌(Yashraj Films) అఫీషియల్‌గా ప్రకటించింది. 2025 ఆగస్టు 14న స్వాతంత్ర దినోత్సవ కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. య‌శ్‌రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివ‌ర్స్‌లో వ‌స్తోన్న ఆరో సినిమా ఇది. హృతిక్‌ రోషన్‌ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌ నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. ఓ రకంగా ప్రతినాయకుడన్నమాట! హృతిక్‌ రోషన్‌కు ధీటుగా ఈ పాత్ర ఉంటుందట! వచ్చే ఏడాది జనవరి నుంచి వార్‌ 2 సినిమా షూటింగ్‌లో ఎన్టీఆర్‌ పాల్గొంటాడు. ఈ సినిమాలో కియారా అద్వానీ(Kiara Advani) హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో ఎన్టీఆర్‌ నటిస్తున్నారు. ఇందులో జాన్వీ కపూర్‌(Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5న సినిమా విడుదల కానుంది. ఆ తర్వాత కేజీఎఫ్‌ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు ఎన్టీఆర్‌.

Updated On 29 Nov 2023 5:55 AM GMT
Ehatv

Ehatv

Next Story