నటి ప్రియమణి(Priyamani) గురించి సినిమా అభిమానులకు ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఆమె జాతీయ ఉత్తమనటి! ఏ పాత్ర ఇచ్చినా అవలీలగా పోషించగల సత్తా ఉన్న నటి. ప్రియమణి పేరు చెప్పగానే మనకు టక్కుమని గుర్తుకొచ్చే సినిమా యమదొంగ. అందులో ఎన్టీఆర్‌తో(NTR) కలిసి నటించారు. తన అమాయకమైన నటనతో ప్రేక్షకులను అలరించారు.

Priyamani
నటి ప్రియమణి(Priyamani) గురించి సినిమా అభిమానులకు ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఆమె జాతీయ ఉత్తమనటి! ఏ పాత్ర ఇచ్చినా అవలీలగా పోషించగల సత్తా ఉన్న నటి. ప్రియమణి పేరు చెప్పగానే మనకు టక్కుమని గుర్తుకొచ్చే సినిమా యమదొంగ. అందులో ఎన్టీఆర్‌తో(NTR) కలిసి నటించారు. తన అమాయకమైన నటనతో ప్రేక్షకులను అలరించారు. అదలా ఉంచితే ఆమె వ్యక్తిగత జీవితంలోనే కాకుండా సినిమా కెరీర్‌కు సంబంధించిన విషయాల్లో కూడా వదంతులను ఎదుర్కొనే ఉంటున్నారు. ఆ మాటకొస్తే ఆమెకు రూమర్లు కొత్తకాదు. ఇప్పుడు లేటెస్ట్‌గా ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను షాకింగ్‌కు గురిచేస్తూ ఆమె గురించి మరో వదంతి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ట్రిపురాల్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా దేవర(Devara). దీనికి కొరటాల శివ(Koratala Shiva) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం(Dual role) చేస్తున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ కూడా కాదనలేదు. దాంతో అదే నిజమని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫిక్సయ్యారు. ఇందులో తారక్‌కు తల్లిగా(Mother Role) ప్రియమణి నటిస్తున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇది ఆశ్చర్యం కలిగించే వార్తే! గతంలో హీరో హీరోయిన్లుగా నటించిన ఈ జోడి ఇప్పుడు దేవరలో తల్లీ కొడుకులుగా నటిస్తున్నారనే వదంతులు రావడంతో తారక్ ఫ్యాన్స్ బిత్తరపోతున్నారు. ఇది నిజమేనా అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఈ నిర్ణయంపై అభిమానుల నుంచి కొంచెం వ్యతిరేకత కూడా వస్తుంది. కానీ మేకర్స్ మాత్రం ఇప్పటికి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. గతంలో కూడా అల్లు అర్జున్ 'పుష్ప-2'లో ప్రియమణి ఓ ప్రముఖ పాత్రలో నటిస్తున్నారని ప్రచారం జరిగింది. ఆ వార్తల్లో నిజం లేదని ఆమె తెలిపింది. కానీ బన్నీతో సినిమా ఛాన్స్ వస్తే తప్పకుండా చేస్తానని ఆమె ప్రకటించింది. బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్ 'జవాన్' లో ప్రియమణి నటించడమే కాకుండా అందరిని మెప్పించిన విషయం తెలిసిందే.
