యానిమల్(animal) సినిమాపై ఇండైరెక్ట్ గా మండిపడ్డారు బాలీవుడ్ స్టార్ రచయిత జావేద్ అక్తర్(Javed Akhtar). అంతే కాదు ఇలాంటిసినిమాలు సమాజానికి హనికరం అన్నారు ఆయన. కాని ఎలాంటి సినిమాలు రావాలనేది నిర్ణయించాల్సింది మాత్రం ప్రేక్షకులేనని అన్నారు జావేద్. అద్భుతమైన సినీమాలకు రచయితగా పనిచేసిన జావేద్ అక్తర్ ప్రస్తుతం సినిమా గురించి చేసిన వాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

మఖ్యంగా యానిమల్ సినిమాను ఇండైరెక్ట్ గా ప్రస్తావిస్తూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి సినిమాలు భారీ విజయాన్ని నమోదు చేయడం ప్రమాదకరమని చెప్పారు. తాను అన్న మాటలకు ఓ ఉదాహరణ కూడా చెప్పారు జావేద్. యానిమల్ సినిమాలోని ఓ సన్నివేశాన్ని గురించి చెబుతూ.. హీరో తన ప్రేమను నిరూపించుకోవడానికి హీరోయిన్ ను బూట్లు నాకాలని అడగడం సమాజంపై..వ్యక్తులపై ఎలాంటి ప్రభావం పడుతుంది అనేది అర్ధం చేసుకోవాలి అన్నారు. ప్రేమను ఎంత పవిత్రంగా భావిస్తారు.. గౌరవించాల్సిన మహిళలను చెంపదెబ్బ కొట్టడం సరైనదేనని చెప్పడం.. వంటి సీన్లు ఉన్నప్పటికీ ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందని. అదే సమాజానికి చేటు చేస్తుందన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా నిర్మాతలకన్నా వాటిని ఆదరించే ప్రేక్షకులకే ఎక్కువ బాధ్యత ఉందని జావేద్ అక్తర్ అభిప్రాయపడ్డారు. నిర్మాతలు ఎలాంటి సినిమాలు తీయాలనేది ప్రేక్షకులపైనే ఆధారపడి ఉంటుందని, ప్రేక్షకాదరణను బట్టే సినిమాలను నిర్మిస్తారని వివరించారు. సినిమాలలో చూపించే విలువలు, నైతికతను గమనించి వాటిని ఆదరించాలా లేక తిరస్కరించాలా అనేది ప్రేక్షకుల చేతుల్లోనే ఉంటుందన్నారు.
ప్రస్తుతం సినీ రచయితలు సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నారని, స్క్రీన్ పై ఎలాంటి హీరోను నిలబెట్టాలని మదనపడుతున్నారని చెప్పారు. గతంలో ధనవంతులను చెడుగా, పేద వాళ్లను మంచివాళ్లుగా సినిమాలలో చూపించేవారని అక్తర్ గుర్తుచేశారు. మారిన పరిస్థితులలో పేద వాళ్లు కూడా ధనవంతులుగా మారుతున్నారని, దీంతో ధనవంతులను చెడుగా చూపించే పరిస్థితి ప్రస్తుతం లేదని ఆయన పేర్కొన్నారు.