ఆరు సీజన్ల పాటు బిగ్‌బాస్ షో(Biggboss) బాగానే సాగింది. చిన్నాచితకా కాంట్రవర్సీలున్నా జనంలో షో పట్ల పెద్దగా వ్యతిరేకత రాలేదు. సీపీఐ నారాయణ(CPI Narayana) వంటి నాయకులు విమర్శలు చేశారనుకోండి.. బిగ్‌బాస్‌ను ఆపేయమంటూ కోర్టుకు(Court) కూడా వెళ్లారు. కాకపోతే ఈసారి మాత్రం బిగ్‌బాస్ షోపై తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. అందుకు కారణం రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్(Pallavi Prashanth).. అతగాడి దెబ్బకు బిగ్‌బాస్‌ను చీదరించుకుంటున్నారు.
ఆరు సీజన్ల పాటు బిగ్‌బాస్ షో(Biggboss) బాగానే సాగింది. చిన్నాచితకా కాంట్రవర్సీలున్నా జనంలో షో పట్ల పెద్దగా వ్యతిరేకత రాలేదు. సీపీఐ నారాయణ(CPI Narayana) వంటి నాయకులు విమర్శలు చేశారనుకోండి.. బిగ్‌బాస్‌ను ఆపేయమంటూ కోర్టుకు(Court) కూడా వెళ్లారు. కాకపోతే ఈసారి మాత్రం బిగ్‌బాస్ షోపై తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. అందుకు కారణం రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్(Pallavi Prashanth).. అతగాడి దెబ్బకు బిగ్‌బాస్‌ను చీదరించుకుంటున్నారు. ఇంతకు ముందెప్పుడూ లేని విధంగా ఫైనల్ తర్వాత గొడవ జరగడం, కార్లు-బస్సులు ధ్వంసం చేయడం, విజేతను పోలీసులు అరెస్ట్ చేయడం వంటి ఘటనలు బిగ్‌బాస్‌కు మచ్చను తెచ్చాయి. ఇప్పుడు నిర్వాహకులకు పోలీసులు నోటీసులు(Notices) కూడా జారీ చేశారు. దీంతో షో నిర్వాహకులు అనూహ్యం నిర్ణయం తీసుకున్నారని వినికిడి. అది అందరిని దిగ్భ్రాంతికి గురి చేస్తోంది.
ఫినాలే జరుగుతుండగానే అన్నపూర్ణ స్టూడియోస్ బయట పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ చాలామంది గుమిగూడారు. దీంతో ర్యాలీ లాంటివి చేయకూడదని ప్రశాంత్‌ను ముందుగానే పోలీసులు హెచ్చరించారు. పోలీసుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ ప్రశాంత్ అభిమానుల దగ్గరకు వచ్చాడు. దాంతో ఫ్యాన్స్ రెచ్చిపోయారు. పలువురు కంటెస్టెంట్ల కార్లు, పోలీసు వాహనాలు, ఆర్టీసీ బస్సు(RTC Buses) అద్దాలను ధ్వంసం చేశారు. ఈ క్రమంలో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రశాంత్‌ని అరెస్ట్ చేసి చంచల్‌గూడ(Chanchalguda jail) జైల‍్లో పెట్టారు. ఇటీవల బెయిల్ మీద బయటకు వచ్చాడు ప్రశాంత్. తాజాగా జూబ్లీహిల్స్ పోలీసులు.. షో నిర్వాహకులకు నోటీసులు కూడా పంపారు. అయితే ఈ తలనొప్పులకు తట్టుకోలేకపోతున్న ఆర్గనైజర్స్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారట! ఇకపై రాబోయే సీజన్స్‌లో పాల్గొనే కంటెస్టెంట్స్ ఎవరైనా సరే ర్యాలీలు లాంటివి చేయకూడదట! ఈ విషయాన్ని అగ్రిమెంట్‌లోనూ పెట్టబోతున్నారట!