Yatra 2 Movie : వ్యూహం సంగతి సరే! యాత్ర-2 పరిస్థితి ఏమిటి? తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం రిలీజ్ కానిస్తుందా?
రామ్‌గోపాల్ వర్మ(Ram Gopal Varma) గొప్ప దర్శకుడే! అద్భతమైన టెక్నిషియనే! సినిమాలపై ఆయనకు ఉన్న ఆపేక్ష, మక్కువ చాలా మంది దర్శకులలో ఉండదన్నది కూడా వాస్తవమే! కాకపోతే ఆయన ఈ మధ్య తీసిన సినిమాలేమీ ప్రేక్షకులను రంజింపచేయలేకపోయాయి. ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి(CM Jagan) కోసమే తీసిన వ్యూహం సినిమా అనేక అవరోధాలను ఎదుర్కొంటోంది. సెన్సాన్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చేసి విడుదల చేసుకోవచ్చని చెప్పినా కోర్టు అడ్డుకుంది. అసలు సినిమాను ఎలా విడుదల చేస్తారో చూస్తామంటూ తెలుగుదేశం పార్టీ(TDP) సవాల్ విసురుతోంది.
రామ్‌గోపాల్ వర్మ(Ram Gopal Varma) గొప్ప దర్శకుడే! అద్భతమైన టెక్నిషియనే! సినిమాలపై ఆయనకు ఉన్న ఆపేక్ష, మక్కువ చాలా మంది దర్శకులలో ఉండదన్నది కూడా వాస్తవమే! కాకపోతే ఆయన ఈ మధ్య తీసిన సినిమాలేమీ ప్రేక్షకులను రంజింపచేయలేకపోయాయి. ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి(CM Jagan) కోసమే తీసిన వ్యూహం సినిమా అనేక అవరోధాలను ఎదుర్కొంటోంది. సెన్సాన్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చేసి విడుదల చేసుకోవచ్చని చెప్పినా కోర్టు అడ్డుకుంది. అసలు సినిమాను ఎలా విడుదల చేస్తారో చూస్తామంటూ తెలుగుదేశం పార్టీ(TDP) సవాల్ విసురుతోంది. రిలీజ్ చేస్తే ఊరుకునేది లేదంటూ రామ్‌గోపాల్ వర్మ ఆఫీసు ముందు ఆందోళనలు, గట్రాలు చేసింది. వ్యూహం సినిమా విడుదల ఎప్పుడున్నది కోర్టు చేతుల్లోనే ఉంది. కోర్టు ఓకే అంటే రిలీజ్ అవుతుంది. లేదంటే లేదు! కాకపోతే వ్యూహం సినిమాపై మొదట్లో ఉన్న ఆసక్తి ఇప్పుడు తగ్గిపోయింది. వస్తే చూద్దాం అని అనుకుంటున్నారే తప్ప రిలీజ్ కోసం ఎదురుచూడటం లేదు.
ఇటీవలి కాలంలో రామ్‌గోపాల్‌వర్మ తీసిన రాజకీయ చిత్రాలేమీ గొప్పగా ఆడలేదు. అది కూడా వ్యూహం(Vyooham) సినిమాపై ఆసక్తి తగ్గడానికి కారణం కావచ్చు. లక్ష్మీస్ ఎన్టీఆర్(Lakshmi's NTR) సినిమా కానీ, కొండా మురళి బయోపిక్ కానీ పట్టుమని పది రోజులు కూడా ఆడలేదు. అన్నట్టు వ్యూహం సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని వర్మ చెప్పారు. శపథం పేరుతో సెకండ్‌పార్ట్‌ను కూడా విడుదల చేస్తామన్నారు. వ్యూహం సినిమానే రిలీజ్ కోసం ఆపసోపాలు పడుతోంది. ఇక శపథం సినిమా ఎప్పుడు వస్తుందో ఏమో! వ్యూహం సినిమా సంగతి అటుంచిందే వచ్చే నెలలో యాత్ర-2 సినిమా విడుదల కాబోతున్నది. ఇది కూడా జగన్మోహన్‌రెడ్డి కోసమే తీసిన సినిమా! యాత్ర-1 సినిమా వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి(YS Rajashekar Reddy) పాదయాత్రపై తీసింది. మమ్ముట్టి(Mamootty) ప్రధాన పాత్ర పోషించారు. వైఎస్ పాత్రను అద్భుతంగా పండించాడు.
ఆ సినిమా హిట్టయ్యింది. ఇప్పుడు యాత్ర-2(Yatra-2) రెడీగా ఉంది. ఇది 2004 నుంచి 2019 వరకు జగన్ ప్రస్థానం మీద ఉంటుంది. అంటే కథలో జగన్మోహన్‌రెడ్డి కాంగ్రెస్(Congress) అధిష్టానంపై తిరుగుబాటు చేయడం, ఓదార్పు యాత్ర, తర్వాత జగన్ జైలుకు వెళ్లడం, జగన్‌పై అక్రమంగా కేసులు పెట్టడం, జేడీ లక్ష్మీనారాయణ హడావుడి చేయడం, తెలుగుదేశంపార్టీ ఇన్‌ప్లీడ్ అవ్వడం.. ఇలా అన్నింటిని సినిమాలో చూపించబోతున్నారు. అసలు ఇవి లేకుండా సినిమా తీయడం అసాధ్యం. సినిమాలో జగన్ హీరో అయితే, సోనియాగాంధీ(Sonia Gandhi) ప్రధాన విలన్., చంద్రబాబునాయుడు(Chandrababu) సెకండ్ విలన్.. ఈ సినిమాను కూడా అడ్డుకుని తీరతామంటోంది తెలుగుదేశంపార్టీ. ఈ సినిమాపై కూడా కోర్టుకు వెళతామంటోంది. సరే, సెన్సార్‌బోర్డు ఓకే చెప్పి, కోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తే సినిమా థియేటర్లలోకి వస్తుంది. అప్పుడు టీడీపీ కూడా ఏమీ చేయలేదు.
పైగా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నది జగన్ ప్రభుత్వం. థియేటర్ల దగ్గర గట్టి బందోబస్తును ఏర్పాటు చేయగలరు. ఎటోచ్చి తెలంగాణలోనే డౌటు! తెలంగాణ విషయానికి వచ్చేసరికి ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ముఖ్యమంత్రిగా ఉన్నది రేవంత్‌రెడ్డి(Revanth reddy). సోనియాను విలన్‌గా చూపించే సినిమాకు రేవంత్‌రెడ్డి ఎలా పర్మిషన్ ఇస్తారు? పైగా మరో మూడు నెలలలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో మినిమం 14 సీట్లు గెలవాలనే సంకల్పంతో ఉన్న రేవంత్ ప్రభుత్వం సోనియాను విలన్‌గా చూపితే సహించగలదా? సోనియా పట్ల వినయవిధేయతను చాటుకునే రేవంత్ రెడ్డి సినిమాకు ఓకే చెప్పగలరా? ఇక ఈ సినిమాలో సెకండ్ విలన్ చంద్రబాబే కదా! చంద్రబాబు అంటే రేవంత్ గురువే కదా! గురువును కించపరిచే సినిమాను సహించగలరా? అందుకే తెలంగాణలో మాత్రం సినిమా విడుదలను కచ్చితంగా అడ్డుకుంటారు.
ఎన్నికల ముందు జగన్‌కు చిన్నపాటి మైలేజ్ కూడా రాకుడదనే కృతనిశ్చయంతో ఉన్న తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీని బాజాభజంత్రీలు వాయించే మీడియా అప్పుడే సినిమాపై నెగటివ్ ప్రచారం మొదలుపెట్టింది. నిజానికి జగన్‌పై అక్రమ కేసులు పెట్టి జైల్లో వేసిన సమయంలో షర్మిల కూడా సోనియాగాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. తిట్టిపోశారు. ఇప్పుడు అదే సోనియాగాంధీ ఆశీస్సులతో ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేతబూనారు. అంటే ఇప్పుడు షర్మిల పూర్తిగా కాంగ్రెస్ మనిషి! పైగా జగన్ వ్యతిరేకి! చంద్రబాబుకు దగ్గరవుతున్నారనే సంకేతాలు కూడా వస్తున్నాయి. అలాంటప్పుడు షర్మిల కూడా సినిమాను కచ్చితంగా అడ్డుకుంటారు. బహుశా షర్మిల ఏపీ పీసీసీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి టాస్క్ ఇదే అవుతుందేమో! షర్మిల ఏం చేస్తుందో చూడాలి! మొత్తంగా యాత్ర-2 సినిమా ఇప్పుడు చర్చనీయాంశమయ్యింది.