Chandrababu Movie : చంద్రబాబుపై సినిమా ఎందుకు రావడం లేదు? అశ్వనీదత్, రాఘవేంద్రరావులు ఏం చేస్తున్నట్టు?
సినిమాల ద్వారా రాజకీయనాయకులు(Politicians) తమ ఇమేజ్‌ను పెంచుకోవడమన్నది ఈ మధ్యన మొదలైన ట్రెండ్. అలాగే అర్థసత్యాలతో, అసత్యాలతో సినిమాలు తీసి ప్రజలలో భావోద్వేగాలను రెచ్చగొట్టవచ్చని కూడా కొన్ని పార్టీలు అనుకుంటున్నాయి.
సినిమాల ద్వారా రాజకీయనాయకులు(Politicians) తమ ఇమేజ్‌ను పెంచుకోవడమన్నది ఈ మధ్యన మొదలైన ట్రెండ్. అలాగే అర్థసత్యాలతో, అసత్యాలతో సినిమాలు తీసి ప్రజలలో భావోద్వేగాలను రెచ్చగొట్టవచ్చని కూడా కొన్ని పార్టీలు అనుకుంటున్నాయి. తెలుగునాట సినిమాలకు, రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. వెండితెర నుంచి వచ్చే కదా ఎన్టీఆర్(NTR) తెలుగుదేశంపార్టీని(TDP) స్థాపించింది. ఆ సమయంలో ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా బోల్డన్ని సినిమాలు వచ్చాయి. నిజానికి తెలుగుదేశంపార్టీతో సినిమావాళ్లకు చక్కటి సంబంధాలు ఉన్నాయి.
చంద్రబాబు(Chandrababu) ముఖ్యమంత్రి అయ్యాక ఆయన సామాజికవర్గానికి చెందిన సినిమావారు టీడీపీకే జైకొట్టారన్నది కాదనలేని వాస్తవం. టీడీపీకి సంబంధించిన ప్రచారాన్ని భుజాన వేసుకున్నది కూడా వారే! అంతెందుకు చంద్రబాబు అరెస్ట్‌పై ప్రకటనలు చేసింది కూడా వారే! మురళీమోహన్(Murali Mohan), రాఘవేంద్రరావు(Raghavendhra Rao), అశ్వనీదత్(Ashwin Dutt), బండ్ల గణేశ్(Bandla ganesh), బోయపాటి వగైరా వగైరాలు ఎవరన్నది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.
అసలు విషయానికి వస్తే రాజకీయ నాయకుల్ని రియల్ హీరోలుగా చిత్రీకరిస్తూ తెరకెక్కిస్తే సినిమాలు ఈ మధ్య బాగానే వస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ(PM Modi) జీవితగాథతో ఓ సినిమానే తీశారు. అందులో మోదీని దాదాపు దైవాంశసంభూతుడిగా చిత్రీకరించారు. మన దగ్గర ఎన్నికలకు ముందు దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డిపై(YS Rajashekar Reddy) యాత్ర(Yatra) అనే సినిమా వచ్చింది. ఈ సినిమా వైఎస్‌ఆర్ కాంగ్రెస్(YSRCP) పార్టీకి రాజకీయంగా కొంత ఉపకరించింది.
తర్వాలో యాత్ర-2 కూడా రిలీజ్ కాబోతున్నది. అలాగే వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై(YS JAgan Mohan Reddy) వ్యూహం-1,2(Vyuham-1,2) అంటూ రాంగోపాల్ వర్మ(Ram Gopal Varma) తెరకెక్కిస్తున్నారు. వచ్చే నెలలో వ్యూహం-1, ఆ తర్వాత ఎన్నికల ముంగిట రెండో సినిమా విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఇంతకు ముందు కూడా ఇలాంటి సినిమాలు వర్మ రెండు మూడు తీశారు. అయితే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, వైఎస్ జగన్మోహన్‌రెడ్డిలపై సినిమాలు తీసినట్టు చంద్రబాబును హీరోను చేస్తూ సినిమా పరిశ్రమకు చెందిన టీడీపీ సానుభూతిపరులు ఎందుకు తీయడం లేదు?
అంటే వారికి చంద్రబాబు హీరోగా కనిపించడం లేదా? చంద్రబాబులో పాజిటివ్ అంశాలు వారికి కనిపించడం లేదా? చంద్రబాబు అనగానే చాలా మందికి వెన్నుపోటు, అవకాశవాది, కుట్రలు కుతంత్రాలు చేసే వ్యక్తిలాగా కనిపిస్తున్నారా? అందుకే సినిమాలు తీయడం లేదా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తున్నది. బ్రహ్మండమైన సినిమాలు తీసే టెక్నిషియన్లు టీడీపీలో బోల్డంత మంది ఉన్నారు.
గోదావరి పుష్కరాల సమయంలో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబును గొప్పగా చూపిద్దామనుకున్న బోయపాటి శ్రీను ఇప్పుడెందుకు ఆ పని చేయడం లేదో అర్థం కావడం లేదు. చంద్రబాబు క్యారెక్టర్‌ను కథానాయకుడిగా చూపిస్తే వర్కవుట్ కాదేమో, కలెక్షన్లు రావేమో అన్న అనుమానం ఉంది కాబట్టే ఆ దిశగా అడుగులు వేయడం లేదు. లేకపోతే ఈ పాటికే చంద్రబాబును అసాధారణ వ్యక్తిగా చూపించేవారు.
"Written By : Senior Journalist Sreedhar"