ఎప్పుడూ ఫ్యామిలీతో(Family) ఫారెన్ ట్రిప్పులు వేసే మహేష్ బాబు.. ఈసారి మాత్రం జర్మనీకి సోలో ట్రిప్(Solo Trip) ఎందుకు వేశాడు అనేది చాలామందికి అర్దం కాలేదు. చాలా వరకూ.. అంతా రాజమౌళి సినిమా కోసం ఇలా చేశాడు అని అనుకున్నారు.

ఎప్పుడూ ఫ్యామిలీతో(Family) ఫారెన్ ట్రిప్పులు వేసే మహేష్ బాబు.. ఈసారి మాత్రం జర్మనీకి సోలో ట్రిప్(Solo Trip) ఎందుకు వేశాడు అనేది చాలామందికి అర్దం కాలేదు. చాలా వరకూ.. అంతా రాజమౌళి సినిమా కోసం ఇలా చేశాడు అని అనుకున్నారు. కాని మహేష్ జన్మనీ ఎందుకు వెళ్లాడంటే..?

సూపర్ స్టార్ మహేష్ బాబు రీసెంట్ గా జెర్మనీకి సోలో ట్రిప్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఫారిన్ కి ఎప్పుడు ఫ్యామిలీతో వెళ్లే మహేష్.. ఈసారి ఒంటరిగా వెళ్లడంతో అభిమానులంతా SSMB29కి సంబందించిన వర్క్ కోసం వెళ్తున్నారని అనుకున్నారు. అయితే మహేష్(Mahesh baby) జెర్మనీ వెళ్ళింది మాత్రం ఒక డాక్టర్‌ని కలుసుకోవడం కోసమట. మహేష్ బాబు పోస్ట్ చేసిన తాజా ఫొటోతో అది తెలిసింది. గతంలో కూడా మహేష్ జర్మనీ డాక్టర్ ను కలవడంతో పాటు.. ఆయనకు కృతజ్ఞతలు తెలపుతూ.. పోస్ట్ చేశాడు. తాజాగా ఆ డాక్టర్ తోనే కనిపించాడు మహేష్.

గతంలో 2023 ఏప్రిల్, 2022 జూన్‌లో కూడా మహేష్ ఆ డాక్టర్ ని కలుసుకున్నట్లు తెలుస్తుంది. ఆ సమయంలో మహేష్ తో దిగిన ఫోటోలను ఆ డాక్టర్ తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఇంతకీ అసలు ఆ డాక్టర్ ఎవరు..? మహేష్ అతని దగ్గర ఏ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు..? అనేది ఎవరికీ తెలియదు. డాక్టర్ పేరు ‘హరీ కొనిగ్(Harry Konig)’. అతను బాడీ ఫిట్‌నెస్ కి సంబంధించిన డాక్టర్ అని తెలుస్తుంది. ఈమధ్య కాలంలో మహేష్ తన ఫిట్‌నెస్ పై ఎక్కువ దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. ఈ పనిమీదనే ఆయన జర్మనీ వెళ్లారా అని అనుమానం కలుగుతోంది.

ఈమధ్య కాలంలో ఫిటో నెస్ మీద ఎక్కువగా దృష్టి పెట్టారు మహేష్ బాబు. ఎప్పుడు చూసినా.. జిమ్ లో వర్క్ అవుట్స్ చేస్తూ కనిపిస్తున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను కూడా మహేష్ రెగ్యులర్ గా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తున్నారు.ఈ వర్క్ అవుట్స్ అన్ని SSMB29 సినిమా కోసమే అని తెలుస్తుంది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ మూవీ అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కబోతుంది.

అంతే కాదు పాన్ వరల్డ్ సినిమాతా తెరకెక్కతున్న ఈసినిమాను భారీ టార్గెట్ తో రాజమౌళి రూపొందిస్తున్నారు. అమెజాన్ అడవుల నేపథ్యంలో భారీ యాక్షన్ సినిమాగా ఈమూవీ రూపొందబోతుంది. దాంతో హాలీవుడ్ రేంజ్ లో మహేష్ కనిపించేందుకు.. ఈ ఫిట్‌నెస్ మంత్రా అని తెలుస్తుంది. కాగా మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ అంతా కంప్లీట్ అయ్యిందని రైటర్ విజయేంద్రప్రసాద్ ఇటీవల అభిమానులకు తెలియజేశారు. ఇక ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందో చూడాలి.

Updated On 22 Jan 2024 5:14 AM GMT
Ehatv

Ehatv

Next Story