మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు శతజయంతిని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం వంద రూపాయల నాణేన్ని(NTR Coin) ముద్రించింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము(Droupadi Murmu) చేతుల మీదుగా ఈ నాణేం విడుదలయ్యింది.
మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు శతజయంతిని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం వంద రూపాయల నాణేన్ని(NTR Coin) ముద్రించింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము(Droupadi Murmu) చేతుల మీదుగా ఈ నాణేం విడుదలయ్యింది. బీజేపీ ఆంధ్రప్రదేశ్ చీఫ్ పురంధేశ్వరి(Daggubati Purandeswari)తో పాటు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు(Chandrababu), భువనేశ్వరి, బాలకృష్ణ, రామకృష్ణ, మోహనకృష్ణ ఇంకా ఎన్టీఆర్ కుటుంబసభ్యులందరూ హాజరయ్యారు. ఒక్క తారక్ తప్ప.. నిజానికి జూనియర్ ఎన్టీఆర్(Jr NTR)కు ఈ కార్యక్రమానికి వెళ్లాల్సింది. దేవర సినిమా షూటింగ్ ఉండటం వల్ల ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి వెళ్లలేకపోయారంటూ వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ వంద రూపాయల నాణేం విడుదల కంటే దేవర షూటింగే ఎన్టీఆర్‌కు ఎక్కువయ్యిందా అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. తాతగారంటే తారక్‌కు ప్రేమ లేక కాదు. తెరవెనుక ఏదో జరిగి ఉంటుంది. ఆహ్వానం అందినా నలుగురు ఏదో అనుకుంటారనే భావనతో ఇచ్చి ఉంటారు తప్ప మనస్ఫూర్తిగా తారక్‌ను పిలిచి ఉండరనే టాక్ కూడా వినిపిస్తోంది. ఆహ్వానం అందిస్తూనే కార్యక్రమానికి రాకుండా ఉంటే మంచిదని ఎన్టీఆర్ కుటుంబసభ్యులు చెప్పి ఉంటారేమో! ఇవన్నీ కాకపోతే చంద్రబాబుకు ఎదురుపడటం ఎన్టీఆర్‌కు ఇష్టం లేకపోయి ఉండవచ్చు. అందుకే కార్యక్రమానికి హాజరు కాకుండా దేవర షూటింగ్ అంటూ తప్పించుకున్నారు. నందమూరి కుటుంబానికి ఎన్టీఆర్‌కు మధ్య చాలా గ్యాప్ ఉందన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. ఎన్టీఆర్‌ను నందరమూరి ఫ్యామిలీ ఎప్పుడూ ఓన్ చేసుకోలేదు. చిన్నప్పట్నుంచే జూనియర్ ఎన్టీఆర్ ఆ వివక్షను ఎదుర్కొన్నాడు. ఆ బాధను అనుభవించాడు. తారక్ తల్లికి నందమూరి కుటుంబ సభ్యుల ఇళ్లల్లో ఎలాంటూ ఎంట్రీ లేదు. కనీసం తారక్‌నైనా దగ్గర తీసుకోవాలి కదా! ఎంతైనా హరికృష్ణ రక్తం పంచుకుని పుట్టినవాడే కదా! దూరం పెట్టడం అటుంచి సినీ ఫీల్డ్‌లో ఎన్టీఆర్‌కు అవకాశాలు రాకుండా కూడా చేశారు. ఎన్టీఆర్ ఎదుగుదలను జీర్ణించుకోలేక మోహనకృష్ణ కొడుకు తారకరత్నను తెరపైకి తెచ్చారు. ఇవన్నీ తెలుగు ప్రజలకు తెలియంది కాదు. బాలకృష్ణను మా బాబాయ్ అంటూ తారక్ సంబోధిస్తాడే కానీ బాలకృష్ణ వైపు నుంచి ఆ ఆప్యాయత ఎప్పుడూ కనిపించలేదు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో కూడా ఎన్టీఆర్‌ను అసలు పట్టించుకోలేదు బాలకృష్ణ. నిజంగానే తారక్‌కు తాత ఎన్టీఆర్ కార్యక్రమానికి వెళ్లాలని ఎంతగా ఉన్నా బాలకృష్ణ- చంద్రబాబుల కారణంగానే హాజరు కాలేదన్నది చాలా మంది చెబుతున్న మాట! ఆహ్వానం అందిందా లేదా అన్నది వేరే మ్యాటర్.. ఆహ్వానం అంది కూడా వెళ్లకపోవడం వెనుక ఉన్న రీజనే సరిగ్గా లేదు. నిజంగానే చంద్రబాబు- బాలకృష్ణల కారణంగానే వెళ్లలేకపోయి ఉంటే ఆ విషయాన్ని చెబితే ఎవరూ ఏమీ అనుకునేవారు కాదు. కానీ దేవర షూటింగ్ వల్లే కార్యక్రమానికి హాజరు కాలేదని చెప్పడం మాత్రం సరిగ్గా లేదు.