✕
ఇలియానా.. ఈ పేరు చెప్పగానే ఒకప్పుడు ఊగిపోయేవాళ్లు ఫ్యాన్స్ అండ్ కామన్ ఆడియన్స్. ప్రస్తుతం ఆమె సినిమాలు చూద్దామంటేనే కరువు అంటున్నారు ఇలియానా ఫ్యాన్స్. 2006 సినిమాలో ‘దేవదాసు’ సినిమాలో భానుమతి క్యారెక్టర్‌తో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైంది ఈ గోవా బ్యూటీ. ఇక ఈ సినిమాతోనే సన్నటి నడుము హీరోయిన్గా పేరు తెచ్చుకుంది ఈ అమ్మడు.

x
Ileana
-
- ఇలియానా.. ఈ పేరు చెప్పగానే ఒకప్పుడు ఊగిపోయేవాళ్లు ఫ్యాన్స్ అండ్ కామన్ ఆడియన్స్. ప్రస్తుతం ఆమె సినిమాలు చూద్దామంటేనే కరువు అంటున్నారు ఇలియానా ఫ్యాన్స్. 2006 సినిమాలో ‘దేవదాసు’ సినిమాలో భానుమతి క్యారెక్టర్‌తో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైంది ఈ గోవా బ్యూటీ. ఇక ఈ సినిమాతోనే సన్నటి నడుము హీరోయిన్గా పేరు తెచ్చుకుంది ఈ అమ్మడు.
-
- ఆ చిత్రం తర్వాత అదే ఇయర్లో వచ్చిన ‘పోకిరి’ సినిమాలో శృతి క్యారెక్టర్‌తో తెలుగు ఆడియన్స్‌లో చెరగని ముద్ర వేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత వచ్చిన ‘ఖతర్నాక్’ సినిమా చేసినప్పటికీ బాక్సాఫీసు దగ్గర పెద్దగా ఆడలేదు ఆ చిత్రం. ఇక రాఖీ, మున్నా, ఆట సినిమాలతో లాక్కొచ్చింది ఇలియానా.
-
- 2009లో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘కిక్’ సినిమాతో మళ్లీ సక్సెస్ అందుకుంది. ఇలా విజయాలు, అపజయాలకు అతీతంగా తిరుగులేని స్టార్‌గా ఎదిగింది ఇలియానా. 2008లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ‘జల్సా’ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన నటించి మంచి విజయాన్ని అందుకుంది సన్నటినడుము భామ.
-
- ఈ చిత్రంతోనే ఈ అమ్మడుకి ఉత్తమ ఫిలింపేర్ అవార్డు కూడా వరించింది. ఆ తర్వాత చేసిన ‘కిక్’ ఆమె అత్యుత్తమ విజయాల్లో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రానికి కూడా ఆమె ఉత్తమ ఫిలింఫేర్ అవార్డును అందుకుంది ఇలియానా. మరోవైపు బాలీవుడ్ లోకి 2012లో ఎంట్రీ ఇచ్చింది. ‘బర్ఫీ’ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ సరసన నటించి అక్కడ కూడా మంచి మార్కులే కొట్టింది ఈ గోవాబ్యూటీ.
-
- ఇక ఈ భామ 2006లో ‘కేడీ’ అనే సినిమాతో తమిళ ఇండస్ట్రీలోనూ అడుగుపెట్టింది. రవికృష్ణ, తమన్నా ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం సక్సెస్ అవ్వకపోయినా ఈ బ్యూటీకి అవకాశాలు ఏమాత్రం తగ్గలేదు. 2010లో ఇటు కన్నడలో ‘హుడుగ హుడుగి’ అనే చిత్రంలోనూ నటించి ఈ సుందరి.
-
- ఈ భామ పుట్టి పెరిగింది ముంబైలో అయినప్పటికీ ప్రస్తుతం గోవాలో సెటిల్ అయింది. సినిమాల్లోకి రాకముందు కొంతకాలం యాడ్స్ అవిఇవీ చేస్తుండేది. వీళ్ల పేరెంట్స్ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. తల్లి ముస్లిం, తండ్రి కేథలిక్ క్రిస్టియన్ అవడం వల.. వీళ్ల ఇంట్లో ఇద్దరు దేవుళ్లకు పూజలు చేసేవారు. ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. ఈ భామకు గ్రీకు నుంచి అడాప్ట్ చేసుకున్న పేరును ఈమెకు ఇలియానా అని పెట్టారు.
-
- ఇక ఈమె ఒకప్పుడు వరుసగా అన్ని భాషల్లో సినిమాలు మీద సినిమాలు చేస్తున్న ఈమె ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. సినిమాల్లో ఛాన్సులు తగ్గిపోవడంతో ఇటు యాడ్స్ చేసుకుంటూ నెట్టుకొస్తుంది ఈ భామ. ఈ గ్యాప్‌లోనే ఆస్ట్రేలియాకు చెందిన ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నిబోన్‌తో ఇలియానాతో డేటింగ్ మొదలెట్టింది. కొంకాలం ప్రేమాయణం నడిపిన వీళ్లిద్దరూ.. ఈ మధ్య బ్రేకప్ అయినట్టు తెలుస్తోంది. అయితే వీళ్లరి విషయంపై ఓ ఇంటర్వ్యూలో అడగడంతో ఇలియానా కస్సుమందట.
-
- అయితే వీళ్లు అప్పట్లో సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండేవాళ్లు. ఇద్దరు ఫొటోలు కూడా అప్డేట్ చేస్తుండేవాళ్లు. ఇక వీళ్లు విడిపోయాక డేటింగ్ గురించి అడగగా.. నా రిలేషన్ గురించి మాట్లొద్దని చెప్పానని.. ప్రేమపై భిన్నాభిప్రాయాలు ఉంటాయని చెప్పుకొచ్చింది. ఇక ఇలియానా తన ఇన్ స్టాగ్రామ్‌లో ఆండ్రూతో ఉన్న ఫొటోలను డిలీట్ చేయడంతోపాటు ఒకరినొకరు అన్ ఫాలో కూడా చేసుకున్నారు.
-
- ఇక ఇలియానా రుస్తుం సినిమాలో మోడ్రన్ పార్సీ మహిళగా కనిపించింది. ఇప్పుడు ‘బాద్ షా హో’ చిత్రంలో పల్లు ధరించి రాయల్లేడీగా కనిపించింది ఈ భామ. ఇక ఈ చిత్రంలో ఓ బోల్డ్ సీన్ లోనూ నటిచింది ఇలియానా. ఈ విషయంపై నటి మాట్లాడుతూ బోల్డ్ సీన్స్ చేయడమంటే ఇద్దరు నటీనటులు మధ్య మ్యూచువల్ ట్రస్ట్ అండ్ రెస్పెక్ట్ అని చెప్పుకొచ్చారు.
-
- ఇక ప్రస్తుతం ఈ భామ మ్యూజిక్ వీడియోలు చేస్తుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామ తన నెక్ట్స్ సాంగ్ గురించి పోస్ట్ కూడా చేశారు. ప్రస్తుతం ఈమెకు సోషల్ మీడియాలో 15 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఈ బ్యూటీ ఎప్పుడూ బీచ్‌ల దగ్గర బికినీ వేసుకుని.. కుర్రకారులో సెగలు పుట్టిస్తోంది.

Ehatv
Next Story