వెండితెరపై(Silver screen) వెలిగిపోవాలని చాన్నాళ్ల నుంచి అనుకుంటున్నాడు కానీ అతగాడి తెరంగేట్రం ఎందుకో వాయిదా మీద వాయిదా పడుతూ వస్తున్నది. అలాగని అతగాడికి ముందూ వెనకా ఎవరూ లేరని కాదు. ఆ మాటకొస్తే నట వారసుడు. వారి వంశంలో చాలా మంది నటించారు. హీరో కావాలని ఆత్రుత పడుతున్న కుర్రోడి తాత మహా నటుడు. అంచేత అభిమానులకు(Fans) ఏం కొదవ లేదు. సినిమాల్లో నటించకముందే అతడికి అభిమాన సంఘాలు ఏర్పడ్డాయంటే మామూలు విషయం కాదు కదా! సరే, మళ్లీ అతడి డెబ్యూ(Debut) సినిమా దగ్గరకు వద్దాం.
వెండితెరపై(Silver screen) వెలిగిపోవాలని చాన్నాళ్ల నుంచి అనుకుంటున్నాడు కానీ అతగాడి తెరంగేట్రం ఎందుకో వాయిదా మీద వాయిదా పడుతూ వస్తున్నది. అలాగని అతగాడికి ముందూ వెనకా ఎవరూ లేరని కాదు. ఆ మాటకొస్తే నట వారసుడు. వారి వంశంలో చాలా మంది నటించారు. హీరో కావాలని ఆత్రుత పడుతున్న కుర్రోడి తాత మహా నటుడు. అంచేత అభిమానులకు(Fans) ఏం కొదవ లేదు. సినిమాల్లో నటించకముందే అతడికి అభిమాన సంఘాలు ఏర్పడ్డాయంటే మామూలు విషయం కాదు కదా! సరే, మళ్లీ అతడి డెబ్యూ(Debut) సినిమా దగ్గరకు వద్దాం. ఎప్పుడు హీరో అవుతాడా అని ఓ వర్గం చాలా ఈగర్‌గా ఎదురుచూస్తోంది. కానీ సినిమానే ఆలస్యమవుతూ వస్తోంది. అతడి ఫోటోలు బయటకు రాకుండా జాగ్రత్తపడుతున్నారు కూడా! వస్తే పర్సనాలిటీ తెలిసిపోతుందన్న భయం కావొచ్చు. సినీ రంగ ప్రవేశం ఎందుకు ఆలస్యమవుతుందని ఎవరూ అడగకముందే వారే చెప్పేస్తూ ఉంటారు. గుర్రపుస్వారీ నేర్చుకుంటున్నాడని ఓసారి, నటనలో శిక్షణ పొందడానికి విదేశాలకు వెళ్లాడని మరోసారి, స్టోరీ ఇంకా ఫైనలైజ్ కాలేదని ఇంకోసారి చెబుతూ వచ్చారు. తండ్రి దర్శకత్వంలోనే హీరోగా నటించబోతున్నాడంటూ ఆ మధ్యన వార్తలు వచ్చాయి. తాజాగా తెలిసిందేమిటంటే అతడి శిక్షణ ముగిసిందట! ఇక సినిమాల్లోకి రావడమే ఆలస్యమంటూ సోషల్ మీడియాలో(social media) స్టోరీలు వచ్చాయి.
అయితే ఆ హీరో తెరంగేట్రం వాయిదా పడుతూ రావడానికి ఇవేవీ కారణాలు కావని తెలిసింది. జాతకాలను(Horoscopes) తెగ నమ్మే కాబోయే హీరో తండ్రిగారు మంచి ముహూర్తం కోసం చూస్తున్నారట! అనేక మంది జ్యోతిష్కులను సంప్రదించారట! స్వయంగా తానే పంచాంగాన్ని తిరగేశారట! తన వారసుడు ఏలినాటి శనితో బాధపడుతున్నాడని తెలుసుకున్న ఆ నట సింహం ఏలినాటి శని తొలగిపోయేవరకు వెయిట్ చేయడమే మంచిదని డిసైడయ్యారట!ఈ మధ్యనే ఆయన శని ప్రభావం నుంచి బయటపడ్డాడట! రేపోమాపో సినిమా ప్రకటన రావొచ్చేమో!