తిరుమల లడ్డూ(tirumala laddu) వివాదాన్ని ఎంతగా రాజేస్తే తమకు అంత మైలేజ్ వస్తుందని తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్లాన్ వేసింది.
తిరుమల లడ్డూ(tirumala laddu) వివాదాన్ని ఎంతగా రాజేస్తే తమకు అంత మైలేజ్ వస్తుందని తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్లాన్ వేసింది. గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూను కల్తీ నెయ్యితో తయారు చేశారంటూ అధికారపక్షం ఆరోపిస్తుంటే, పచ్చి అబద్ధమని ప్రతిపక్షం అంటోంది. లడ్డూ వివాదాన్ని కేవలం రాజకీయ నాయకులే రగిలిస్తున్నారు తప్ప చాలా మంది ప్రముఖులు ఎందుకొచ్చిన గొడవని సైలెంట్‌గా ఉంటున్నారు. తమిళ హీరో కార్తీ(Karthi) కూడా లడ్డూపై మాట్లాడకూడదని అనుకున్నాడు. సత్యం సుందరం(Satyam sundharam) సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో లడ్డూ కావాలా నాయనా? అంటూ యాంకర్ కార్తీని అడిగారు. యాంకర్ అలా అడగడానికి ఓ కారణం ఉంది. కార్తీ నటించిన సిరుత్తై (తెలుగులో విక్రమార్కుడు) సినిమాలో లడ్డూ కావాలా నాయనా అనే డైలాగు ఉంటుంది. ఆ డైలాగునే యాంకర్ చెప్పారు. సరే , యాంకర్ అడిగినదానికి కార్తీ ఏమన్నారంటే 'ఇప్పుడు లడ్డూ గురించి మాట్లాడకూడదు. సెన్సిటివ్ టాపిక్' అని అన్నాడు. లడ్డూపై స్పందించనని కూడా చెప్పాడు. ఇందులో తప్పు ఎక్కడుంది? ఇందులో పవన్‌కు(Pawan kalyan) మాత్రం ఎందుకు తప్పు కనిపించింది. పవన్ కోపం తెచ్చుకునేంతగా కార్తీ ఏమన్నారని? ఏం అనుకుండానే పవన్‌కు మాత్రం కోపం నషాళానికి అంటింది. ఆ కోపంతో కార్తీని ఘాటుగా విమర్శించారు పవన్. 'మీరు మాట్లాడితే పద్ధతిగా మాట్లాడండి. లేదంటే మౌనంగా కూర్చోండి. అపహాస్యం చేస్తే మాత్రం ప్రజలు మిమ్మల్ని క్షమించరు. లడ్డూని సెన్సిటివ్ ఇష్యూ అనకండి. ఒక్క కామెంట్ చేసే ముందు వంద సార్లు ఆలోచించండి' అని పవన్ విరుచుకుపడ్డారు. కార్తీ లడ్డూను అపహాస్యం చేసినట్టుగా ఎక్కడైనా అనిపించిందా? లేదు కదా! హుందాగానే మాట్లాడాడు కదా! మరి పవన్ ఎందుకలా కోపం తెచ్చుకున్నారంటే దాని వెనుకాల ఓ ప్లాన్ ఉన్నట్టుగా అనిపిస్తోంది. ఇప్పటి వరకు లడ్డూపై సినిమా ఇండస్ట్రీ వారు ఎవరూ మాట్లాడలేదు. బహుశా వారందరినీ మాట్లాడించాలన్నది పవన్ ఉద్దేశం కాబోలు. పైగా వారందరూ తెలుగుదేశంపార్టీకి అనుకూలంగా మాట్లాడాలన్నది పవన్ అభిమతం కూడా కావొచ్చు. తిరుమలకు తమిళనాడు నుంచి కూడా భక్తులు వస్తుంటారు కాబట్టి కోలీవుడ్‌ను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయాలని పవన్ అనుకుంటున్నారేమో!