తెలంగాణ మంత్రి కొండా సురేఖ(KONDA SUREKHA) చేసిన అసహ్యకరమైన వ్యాఖ్యలపై తెలుగు సినిమా ఇండస్ట్రీ విరుచుకుపడింది.
తెలంగాణ మంత్రి కొండా సురేఖ(KONDA SUREKHA) చేసిన అసహ్యకరమైన వ్యాఖ్యలపై తెలుగు సినిమా ఇండస్ట్రీ విరుచుకుపడింది. దుర్మార్గపు మాటల దాడులను ముక్తకంఠంతో వ్యతిరేకిస్తామని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. వ్యక్తిగత విషయాలను రాజకీయల కోసం వాడుకోవడం నీచమని ఎన్టీఆర్(NTR) కామెంట్ చేశారు. సురేఖ చేసిన చౌకబారు, నిరాధారమైన వ్యాఖ్యలను మహేశ్‌బాబు(Mahesh babu) ఖండించారు. పబ్లిక్‌గా మాట్లాడేటప్పుడు గౌరవాన్ని కాపాడుకోవాల్సిన నైతిక బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని దగ్గుబాటి వెంకటేశ్ వ్యాఖ్యానించాడు. ఓ మహిళా మంత్రి పైశాచిక వ్యూహాలను అవలంబించడం తనను భయాందోళనకు గురిచేస్తోందని రవితేజ అన్నారు. సాటిమనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండి అంటూ అక్కినేని నాగార్జున సుతిమెత్తగా హుందాగా స్పందించారు. ఇంకా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నాచురల్ స్టార్ నాని, వరుణ్ తేజ్, నాగచైతన్య, చిన్మయి శ్రీపాద, రామ్‌గోపాల్ వర్మ(Ram gopal varma), అక్కినేని అఖిల్, కోన వెంకట్, విశ్వక్సేన్, మంచు మనోజ్, మంచు మనోజ్, మంచు లక్ష్మి, లావణ్య త్రిపాఠి, ఖుష్బూ, సుధీర్ బాబు, శ్రీకాంత్ ఓదెల, అక్కినేని అమల ఇంకా చాలా మంది సినీ ప్రముఖులు రియాక్టయ్యారు. ఇలా ప్రతి ఒక్కరు సురేఖ వ్యాఖ్యలను ఖండించారు. సమంతకు సానుభూతి మాటలు చెప్పారు. ఇక్కడితో ఇండస్ట్రీ పెద్దలు ఆగిపోకూడదు. కేవలం ట్వీట్లకే పరిమితమైతే రేప్పొద్దున మరొకరు ఇండస్ట్రీ మహిళలను కారుకూతలు కూస్తారు. అంచేత మొక్కుబడిగా ఏదో చెప్పేసి ఊరుకుంటే సరిపోదు. ఇదే ఐక్యత అన్ని అంశాలలో ఉండాలి. సామాజిక బాధ్యత ఉండటం మంచిదే. చిత్రమేమిటంటే ఇప్పటి వరకు ఆల్‌మోస్టాల్ అందరూ పెద్ద హీరోలు స్పందించారు. ఒక్క నందమూరి బాలకృష్ణ తప్ప. ఇది తనకు సంబంధం లేదన్నట్టుగా ఆయన ఉన్నారు. పాత గొడవలు దృష్టిలో పెట్టుకుని బాలయ్య(Bala krishna) మాట్లాడటం లేదంటున్నారు కొందరు. ఇది ఆయనకు తగని పని! ఇప్పటికైనా బాలయ్య మౌనం వీడి ఇండస్ట్రీ మహిళపైన ఓ మంత్రి చేసిన అసహస్యకరమైన వ్యాఖ్యలపై స్పందిస్తే మంచిది!