హీరో బాలకృష్ణ(Balakrishna) సినీ రంగ ప్రస్థానానికి 50 ఏళ్లు.
హీరో బాలకృష్ణ(Balakrishna) సినీ రంగ ప్రస్థానానికి 50 ఏళ్లు. చాలా తక్కువ మంది నటులకే ఈ రికార్డు ఉంటుంది. అందుకే బాలకృష్ణ స్వర్ణోత్సవాన్ని టాలీవుడ్ ఘనంగా నిర్వహించింది. పరిశ్రమకు చెందిన చాలా మంది ఈ వేడుకలో పాలుపంచుకున్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమానికి చిరంజీవితో(Chiranjeevi) పాటు అల్లు అర్జున్‌ను(allu arjun) కూడా ఆహ్వానించారు. ఎందుకో తెలియదు కానీ బన్నీ ఈ వేడుకలో పాల్గొనలేదు. అల్లు అర్జున్ వచ్చి ఉంటే చిరంజీవిని కలిసేవాడు. ఇద్దరూ కలిసి కనిపిస్తే అభిమానుల మధ్య ఉన్న గొడవలు కాసింత తగ్గేవేమో! కానీ ఆ ఛాన్స్ లేకుండా పోయింది. నిజానికి బాలయ్యతో అల్లు అరవింద్‌కు ఉన్న అనుబంధం ప్రత్యేకమైనది. అల్లు అర్జున్ కూడా బాలయ్యకు చాలా క్లోజ్. ఆహాలో వస్తున్న అన్‌స్టాపబుల్(Unstopable) కార్యక్రమానికి హోస్టుగా వ్యవహరిస్తున్న బాలకృష్ణ ఆ కార్యక్రమాన్ని ఒంటిచేత్తో నడిపిస్తూ సక్సెస్ చేసిన విషయం తెలిసిందే. అందులో బాలయ్య- అల్లు అర్జున్ సాన్నిహిత్యాన్ని ప్రజలు కూడా చూశారు. అక్కినేని నాగార్జున(Akkineni nagarjuna) కూడా ఈ వేడుకకు అటెంట్ కాలేదు. బాలయ్య, నాగార్జున మధ్య చాన్నాళ్లుగా అభిప్రాయబేధాలున్నాయి. బాలకృష్ణతో ఫ్రెండ్‌షిప్‌ను మెయింటైన్ చేద్దామని నాగార్జున చాలా సార్లు ప్రయత్నించారు. బాలయ్య వైపు నుంచి రియాక్షన్ లేకపోవడంతో గమ్మున ఉండిపోయారు నాగ్! అందుకే స్వర్ణోత్సవానికి నాగార్జున డుమ్మా కొట్టారు. నాగార్జున ఒక్కరే కాదు అక్కినేని ఫ్యామిలీ సభ్యులెవరూ అక్కడ కనిపించలేదు. సాధారణంగా ఏదైనా వేడుకకు తాను హాజరయ్యే పరిస్థితి లేనప్పుడు కొడుకు నాగచైతన్యను పంపిస్తుంటాడు నాగార్జున. కానీ ఈసారి ఆ పని కూడా చేయలేదు. ఇక జూనియర్ ఎన్టీఆర్(Jr.NTR) అంటారా? ఆయనకు అసలు పిలుపే లేదు. తారక్ రాడన్న సంగతి ఊహించిందే! ఎన్టీఆర్ ఇప్పుడు కుటుంబసమేతంగా గుళ్లు గోపురాలు తిరుగుతున్నారు. రావాలనుకుంటే ఎన్టీఆర్‌కు పెద్ద కష్టమైన పనేమీ కాదు. కాకపోతే పిలవని పేరంటానికి ఎందుకు వెళ్లడం అని అనుకున్నాడు. నందమూరి కుటుంబానికి, ఎన్టీఆర్‌కు మధ్య గ్యాప్ ఎంత పెద్దదో ఇప్పడు అందరికీ తెలిసిపోయింది. సరే ఎన్టీఆర్ అంటే పడకపోవచ్చు. కల్యాణ్‌రామ్‌కు ఏమైంది? అతడు స్వయాన అన్న కొడుకే కదా! ఆ మాటకొస్తే ఎన్టీఆర్ కూడా అంతే అనుకోండి! హరికృష్ణ మీద ఉన్న భక్తితో కూడిన ప్రేమతో అయినా కల్యాణ్‌రామ్‌ను పిలవొచ్చు. ఆ పని కూడా చేయలేదు. బహుశా ఎన్టీఆర్‌తో కల్యాణ్‌రామ్ దగ్గరగా ఉంటున్నాడనే కారణం కావచ్చు.