ఈ శుక్రవారం విడుదలైన సినిమాలలో బూట్ కట్ బాలరాజు సినిమా ఒకటి. ఈ సినిమాలో బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ హీరో.

Why are my Bigg Boss fans not watching my films
ఈ శుక్రవారం విడుదలైన సినిమాలలో బూట్ కట్ బాలరాజు(Bootcut Balaraju) సినిమా ఒకటి. ఈ సినిమాలో బిగ్ బాస్(BiggBoss) ఫేమ్ సోహెల్(Sohail) హీరో. అంతకు ముందు సోహెల్ మిస్టర్ ప్రెగ్నెంట్(Mister Pregnent), ఆర్గానిక్ మామా హైబ్రిడ్ అల్లుడు(Organic Mama Hybrid Alludu), లక్కీ లక్ష్మణ్(Lucky Lakshman) వంటి సినిమాల్లో నటించాడు. అతడి కొత్త చిత్రం బూట్‌కట్ బాలరాజు థియేటర్లలోకి వచ్చింది. హైదరాబాద్‌లోని ప్రసాద్స్ మల్టీప్లెక్స్(Prasad Multiplex)లో సినిమా చూసిన తర్వాత సోహెల్ భావోద్వేగానికి గురయ్యాడు. అతడి మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బిగ్ బాస్ సమయంలో వేల మంది కామెంట్స్ రాస్తూ నన్ను సపోర్ట్ చేసేవారు. ఇప్పుడు ఏమైంది? నా అభిమానులు నన్ను ఎందుకు సపోర్ట్ చేయడం లేదని ప్రశ్నించాడు. మీరు నా సినిమాలు ఎందుకు చూడటం లేదు? దయచేసి నా సినిమాకి రండి.. ఈ రోజుల్లో సినిమా నిర్మాతలు క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లు చేయడం లేదని అంటున్నారు. ఇప్పుడు కుటుంబ సమేతంగా చూడగలిగే సినిమాతో ముందుకు వచ్చాం. బూట్‌కట్ బాలరాజును చూసిన వారు దానిపై ప్రశంసలు కురిపిస్తున్నారని సోహెల్ తెలిపాడు. మంచి కంటెంట్ సినిమాని అందించినా జనాలు చూడడం లేదు కాబట్టి ఈసారి అడల్ట్ కంటెంట్‌తో కూడిన సినిమా చేస్తాను. ఇకపై ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లు చేయను. బూట్‌కట్ బాలరాజు చాలా మంచి సినిమా. ప్రమోషన్లు చేయడానికి మా దగ్గర డబ్బు లేదు కాబట్టి అందరూ సినిమా చూడవలసిందిగా కోరుతున్నానని సోహైల్ తెలిపాడు.
