డబ్బున్నవారు విడాకుల(Divorce) కోసం వందనా షానే(Vandhan shah) కలుస్తారు.
డబ్బున్నవారు విడాకుల(Divorce) కోసం వందనా షానే(Vandhan shah) కలుస్తారు. ఏ.ఆర్.రెహమాన్(AR Rehman)-సైరా బాను(Syrabanu) విడాకుల వ్యవహారాన్ని కూడా ఆమెనే చూస్తున్నారు. ఆమెకు హై ప్రొఫైల్ డివోర్స్ కేసులు చూసే మహిళా లాయర్‌గా మంచి పేరు ఉంది. విడాకులు ఇప్పించడం మంచిపనో కాదో తెలియదు కానీ తాను వారికి స్వేచ్ఛను ఇప్పిస్తున్నాను అని చెబుతుంటారు వందనా షా! ఆమె కూడా భర్త నుంచి విడాకులు తీసుకున్న తర్వాతే లా ప్రాక్టీసు మొదలు పెట్టారు. వందనా షా గుజరాత్‌కు(Gujarat) చెందిన లాయరే కానీ ఆమె ప్రాక్టీసు అంతా ముంబాయి, పూణెలలో ఉంది.
రెహమాన్-సైరా బాను పెళ్లి 1995లో జరిగింది. అదే ఏడాది మణిరత్నం సినిమా బొంబాయి(Bombay) విడుదలయ్యింది. దీనికి రెహమాన్ సంగీతం అందించారు. బొంబాయిలో హీరోయిన్ పేరు సైరా బాను. రెహమాన్ భార్య పేరు కూడా సైరా బాను కావడం యాదృచ్ఛికమే! అంతా బాగుంటే వచ్చే ఏడాది 30వ పెళ్లి రోజును గ్రాండ్‌గా జరుపుకునేవారు. ఇప్పుడా అవకాశం లేదు. రెహమాన్ దంపతులు విడిపోతారని ఎవరూ ఊహించలేదు. విధి వశాత్తూ అది జరిగింది. వీరి విడాకుల వ్యవహారాన్ని చూస్తున్నది వందనా షానే! సైరా బాను 1973లో గుజరాత్‌లోని కచ్‌లో జన్మించారు. గుజరాతి ముస్లిం కుటుంబానికి చెందిన వారు. వీరి కుటుంబం నుంచి ఓ కూతురును మలయాళ నటుడు రెహమాన్ (రఘు) పెళ్లి చేసుకున్నారు. రఘు కొన్ని తెలుగుసినిమాల్లో కూడా నటించారు. మరో అమ్మాయిని రెహమాన్ పెళ్లి చేసుకున్నారు. రెహమాన్ అచిరకాలంలోనే దేశంలోనే గొప్ప సంగీత దర్శకుడయ్యాడు. పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. దాంతో పాటు డబ్బూ వచ్చింది. ఈ సమయంలో సైరాబానుకు ముఖేశ్ అంబానీ(Mukesh ambani) సతీమణి నీతా అంబానీతో దోస్తానా కుదిరింది. మంచి స్నేహితులయ్యారు. మొన్నామధ్యన జరిగిన అంబానీ కుమారుడి పెళ్లిలో రెహమాన్ ప్రత్యేక షో కూడా ఇచ్చారు. రెహమాన్ మ్యూజిక్ షోలకు తన భార్య సైరా బానును తీసుకెళ్లేవాడు. ఆయన ఫేస్‌బుక్ పేజీలో ఇంకా భార్యతో కలిసి ఉన్న ఫోటోనే కవర్ ఫోటోగా ఉంది. ఇద్దరి మధ్య ప్రేమానుబంధాలు ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు విడిపోవాల్సి వస్తున్నదో తెలియదు. ఇద్దరి మధ్య ఎంత ప్రేమ ఉన్నా వెనక్కు రాలేనంత అగాధం ఏర్పడిందని వందనా షా అంటున్నారు. ధనవంతుల ఇళ్లలో భార్య భర్తల మధ్య ఆస్తుల పంపకం, పిల్లల బాధ్యత ప్రధాన సమస్యలని, ఇగో, వివాహేతర సంబంధాలు తర్వాత స్థానంలో ఉంటయని వందనా షా చెబుతున్నారు. డబ్బున్నవారు పెళ్లికి ముందే ఓ అగ్రిమెంట్ చేసుకుంటే మంచిదని సూచిస్తున్నారు వందనా షా. ఒకవేళ విడాకులు తీసుకునే పరిస్థితి వస్తే ఆస్తిలో ఎవరికి ఎంత భాగం? పిల్లలకు ఎంత? అన్న విషయాలు ముందే మాట్లాడుకుంటే ఎలాంటి గొడవలు రావడని సూచిస్తున్నారామె! మధ్యతరగతి వారి విడాకులకు ప్రత్యేకంగా ఉనికి సమస్య కారణమవుతుందని అంటున్నారు. పిల్లలు పెద్దవారయ్యాక మహిళలో ఉనికి సమస్య మొదలవుతుందని, తన జీవితానికి సరైనా ప్రాధాన్యత దొరకడం లేదన్న అసంతృప్తి ఏర్పడుతుందని వందనా షా వివరించారు. నిరంతరం గొడవ పెట్టుకుని ఒకరినొకరు హింసించుకునే బదులు విడాకులు తీసుకోవడమే ఉత్తమం అని అంటారు. భర్తల తరఫున కూడా ఆమె వకాల్తా పుచ్చుకుంటారు. 'బాగా సంపాదించే భార్య సహజంగానే తన భర్తను ఇంటిపట్టున ఉండమంటుంది. అతడిపై ఆధిపత్యం చెలాయిస్తుంటుంది. ఆ ఆధిపత్యం, అవమానం భరించలేక భర్తలు విడాకులకు మొగ్గు చూపుతుంటారన్నది వందనా షా చెబుతున్న మాట! అదీ కాకుండా ఇంట్లో తల్లా? పెళ్లామా? అన్న సమస్య భర్తకు ఎదురవుతుంటుందని, ఎవరినీ కాదనలేక సతమతమవుతూ చివరకు విడాకులు తీసుకోవడమే మంచిదనే నిర్ణయానికి వస్తాడని వందనా షా చెబుతున్నారు.