హీరో నారా రోహిత్‌ -సిరి లెల్లా నిశ్చితార్థం ఘనంగా జరిగింది.

హీరో నారా రోహిత్‌ -సిరి లెల్లా నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Nara chandrababu)-భువనేశ్వరి(Bhuwaneswari) దంపతులు విచ్చేసి ఆశీస్సులు అందించారు. చంద్రబాబు తమ్ముడు రామూర్తి నాయుడు కుమారుడే రోహిత్‌! ఆయన పెళ్లి చేసుకోబోతున్న సిరి లెల్లా(Siri lella) ఎవరనేది ఆసక్తిగా మారింది. సిరి లెల్లా అసలు పేరు శిరీష. ఆమె పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని దైద సిరిలో పుట్టారు. కొన్ని కారణాల వల్ల సిరి లెల్లా కుటుంబం దైద సిరిని వదిలిపెట్టేసి రెంటచింతలకు వలస వచ్చింది. సిరి తండ్రి రియల్ ఎస్టేట్‌ వ్యాపారి. తల్లి గృహిణి. డిగ్రీ వరకు ఇక్కడే చదువుకున్న సిరి తర్వాత మాస్టర్స్‌ చేయడం కోసం ఆస్ట్రేలియా వెళ్లారు. మొదట్నుంచి ఆమెకు నటి(Actress) కావాలన్న కోరి క బలంగా ఉండింది. ఆస్ట్రేలియాలో మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చినా వాటిని కాదని సినిమాల్లో నటించడం కోసం ఇండియాకు తిరిగి వచ్చారు. హైదరాబాద్‌లో తన అక్క దగ్గర ఉంటూ సినిమా అవకాశల కోసం ప్రయత్నించసాగారు. మొదట మోడల్‌గా(Model) కెరీర్‌ను ప్రారంభించారు. ప్రతినిధి 2 సినిమా ఆడిషన్స్‌ జరుగుతున్నాయని తెలిసి అక్కడి వెళ్లారు. లక్కీగా హీరోయిన్‌గా సెలెక్ట్‌ అయ్యారు. ఈ సినిమా షూటింగ్‌ అప్పుడే నారా రోహిత్‌- సిరి లెల్లా ప్రేమలో పడ్డారు. తన ప్రేమ గురించి నారా రోహిత్‌ మొదట తన పెద్దమ్మ భువనేశ్వరికి చెప్పారట! ఆమె సంతోషించి అమ్మాయి తరఫు వారితో మాట్లాడి సంబంధం కుదిర్చారు. సిరికి ముగ్గురు అక్కలు ఉన్నారు. పెద్ద అక్క శ్రీలక్ష్మి రెంటచింతలలోనే అంగన్వాడీ సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నారు. రెండో అక్కడ భవానీ పెళ్లి చేసుకుని అమెరికాలో ఉంటున్నారు. మూడో అక్క ప్రియాంకకు కూడా పెళ్లయ్యింది. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లో ఉంటున్నారు. రోహిత్‌-సిరి పెళ్లి ఈ ఏడాది డిసెంబర్‌లో జరగనుంది.



Eha Tv

Eha Tv

Next Story