వేణుస్వామిది తప్పు
వివాదాస్పద జ్యోతిష్కుడు వేణుస్వామి(Venu swamy) మొన్న నాగచైతన్య(Naga chaithanya), శోభిత(Shobitha) ఎంగేజ్‌మెంట్‌పై తనకు తోచిన జోస్యం చెప్పారు. అది కూడా మీడియా సంస్థలకు వెళ్లి చెప్పలేదు. తనే స్వయంగా ఓ వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే వేణుస్వామిపై విరుచుకుపడటం మొదలయ్యింది. అసలు వేణుస్వామి జ్యోతిష్కుడే కాదన్నారు. జాతకం చెప్పడం రాదన్నారు. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల్లో జ్యోతిష్యం పేరిట జొరపడిదే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. జర్నలిస్టులందరూ కలిసి నేరెళ్ల శాదరకు కంప్లయింట్ చేశారు. కేసులు పెట్టారు. కోర్టుకు వెళతామని హెచ్చరించారు. చిత్రమేమిటంటే ఆ జర్నలిస్టులు పని చేస్తున్న మీడియా వేణుస్వామి కంటే ఇంకా ఎక్కువ అతి చేస్తున్నది. వారం రోజులుగా దువ్వాడ శ్రీనివాస్(Duvvada srinivas) కుటుంబ వ్యవహారాన్ని కథలు కథలుగా చూపిస్తూ టీఆర్‌పీ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నది. అక్కడికి తెలుగు రాష్ట్రాలలో, మన దేశంలో వార్తలేవీ లేనట్టుగా! అంతకు ముందేమో విజయసాయిరెడ్డి(Vijay Sai reddy) ఎపిసోడ్‌తో కాలక్షేపం చేసింది. ఆ తర్వాత రాజ్‌తరుణ్(Raj tharun)-లావణ్య చౌదరి(Lavanya chowdhary) ప్రేమ కథను కథలు కథలుగా ప్రసారం చేసింది. ఇప్పుడు వేణుస్వామి జ్యోతిష్యం పేరిట ఏదో చెబితే మాత్రం తప్పయ్యింది. వేణుస్వామి చెప్పేది జ్యోతిష్యం కాదుసరే! మరి ఎవరు నమ్మమన్నారు? నమ్మతే నమ్మండి.. లేకపోతే లేదు.. ఇవే ఛానళ్లు మొన్నటి ఎన్నికల ముందు ఆరేడుగురు జ్యోతిష్యులను స్టూడియో కూర్చొబెట్టి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడుతారు అని డిబేట్ పెట్టినప్పుడు జ్యోతిష్యం మూఢనమ్మకమని తెలియదా? అమెరికా అధ్యక్ష ఎన్నికల పోటీ నుంచి బైడెన్ తప్పుకుంటాడని ఎవరో అమెరికాకు చెందిన వాడే చెప్పాడట! ఎన్నికల్లో ట్రంప్(Trump) ఓడిపోతాడని అమెరికాకు చెందిన ప్రసిద్ధ జ్యోతిష్కుడు చెప్పాడట! మరి వీటిని ఎలా నమ్మడం? టీవీ ఛానెళ్లలో సర్వేల పేరుతో డిబేట్లు పెడతాయి కదా? మరి వాటి సంగతేమిటి? వాటిల్లో ఏమైనా శాస్త్రీయత ఉంటుందా? ఎవరికి ఇష్టమొచ్చినట్టుగా వారు సర్వేలు రాసుకోలేదా? తాము అభిమానించే పార్టీకే గెలిచే ఛాన్సు ఉందని చెప్పలేదా? వ్యక్తుల వ్యతిగత జీవితాలను తాము మాత్రం నిసిగ్గుగా బజారులోకి తీసుకురావచ్చు. కానీ వేణుస్వామి మాత్రం జాతకం చెప్పకూడదు. ఇదెక్కడి న్యాయం? వేణుస్వామి చెప్పినవన్ని నిజాలు అవుతాయనడానికి ఎలాంటి ఆధారమూ లేదు. తనే ఆ విషయం చెప్పారు. నాగ చైతన్య, శోభిత విషయం కూడా తాను చెప్పింది తప్పు కావచ్చని వేణు స్వామినే అన్నారు. ఎంగేజ్‌మెంట్ ముహూర్తం బాగాలేదని వేణుస్వామి చెప్పడం కరెక్టు కాదని కొందరు జర్నలిస్టులు అంటున్నారు. వేణస్వామి చెప్పింది తప్పే అయితే ఆ వీడియోను టెలికాస్ట్ చేసి టీఆర్‌పీ పెంచుకున్న టీవీ చానెళ్లను ఏమనాలి?