జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనుకున్నది సాధించాడు. మొన్నటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన విజయం సాధించాడు. జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లోనూ విజయం సాధించడం విశేషం.
జనసేన అధినేత పవన్ కల్యాణ్(Janasena Chief Pawan Klayan) అనుకున్నది సాధించాడు. మొన్నటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన విజయం సాధించాడు. జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లోనూ విజయం సాధించడం విశేషం. ప్రస్తుతం పవన్ ఏపీ డిప్యూటీ సీఎం(Deputy CM Pawan Kalyan). పదవి వచ్చినప్పటి నుంచి ప్రజాసేవలోనే ఉంటున్నాడు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో ఉన్నారు. ఇంత వరకు బాగానే ఉంది. మరి సినిమాల సంగతేమిటి? పవన్ హీరోగా సినిమాలు మొదలు పెట్టి షూటింగ్‌లు మధ్యలో ఆగిపోయిన వాటి పరిస్థితి ఏమిటి? నిర్మాతలు చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్నారు. పవన్ నటిస్తున్న సినిమాలో హరి హర వీరమల్లు ఒకటి. ఈ సినిమా షూటింగ్ 80 శాతం వరకు పూర్తయ్యింది. ఇంకో 20 శాతం మాత్రమే మిగిలి ఉంది. ఈ సినిమా బ్యాలెన్స్ వర్క్ పార్ట్ కోసం ప్రొడ్యుసర్ ఎ.ఎం.రత్నం పవర్‌స్టార్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. పది రోజులు డేట్స్ ఇస్తే చాలని రత్నం అడుగుతున్నారు. ఇక సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఓజీ సినిమా కూడా దాదాపుగా పూర్తయ్యింది. ఈ సినిమాను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి ఈ ఏడాదే రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు మేకర్స్. వీటితో పాటు హరీశ్ శంకర్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఉస్తాద్ గబ్బర్‌సింగ్ సినిమా కూడా ఓ రెండు షెడ్యూల్స్‌ను మాత్రమే పూర్తి చేసుకుంది. పవన్ కల్యాణ్ ఇప్పట్లో డేట్స్ ఇవ్వడని తెలుసుకునే హరీశ్ శంకర్ మిస్టర్ బచ్చన్ సినిమాను పూర్తి చేశాడు. ఇందులో రవితేజ హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం వీరందరికీ డేట్స్ ఎలా అడ్జెస్ట్ చేయాలో పవన్‌కు తెలియడం లేదు. ఎందుకంటే ప్రస్తుతం రాజకీయాలలో బీజీగా ఉన్నాడు. అయితే తనకు టైమ్ దొరికినప్పడు తప్పకుండా సినిమాలు పూర్తి చేద్దామని నిర్మాతలో చెప్పాడట! నిర్మాతలు కూడా టైమ్ ఎప్పుడు దొరుకుతుందోనని ఎదురుచూస్తున్నారు.ఆగిపోయిన సినిమాలకు పవన్ ఎప్పుడు డేట్స్ ఇస్తాడు?