పాన్‌ ఇండియా స్టార్‌ (Pan India Star)ప్రభాస్‌ (Prabhas)నటించిన కల్కి 2898 ఏడీ(Kalki 2898 AD) సినిమా సూపర్‌ డూపర్‌ హిట్టయింది.

పాన్‌ ఇండియా స్టార్‌ (Pan India Star)ప్రభాస్‌ (Prabhas)నటించిన కల్కి 2898 ఏడీ(Kalki 2898 AD) సినిమా సూపర్‌ డూపర్‌ హిట్టయింది. బ్రహ్మండమైన కలెక్షన్లు సాధించింది. రికార్డుల మీద రికార్డులు సృష్టించింది. సినిమా థియేటర్లలోకి వచ్చి నెల రోజులు దాటింది. థియేటర్లలో జనం పలచబడుతున్నారు. ఒకట్రెండు చోట్ల తప్పితే చాలా చోట్ల సినిమా థియేటర్‌ రన్ చివరకు వచ్చేసింది. దాంతో ప్రేక్షకులు ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. మూవీ మేకర్స్‌ (Movie Maker)స్ట్రీమింగ్‌ డేట్‌ను ఫిక్స్‌ చేశారట కూడా! కల్కి సినిమా తెలుగు హక్కులను అమెజాన్‌ ప్రైమ్(Amazon Prime) సొంతం చేసుకుంది. ముందే చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీ(OTT)లోకి తీసుకురావాలి. అందుకే ఆగస్టు 23వ తేదీన ఓటీటీలోకి తీసుకురావాలని అనుకుంటున్నారు. అంతకు ముందు వారం అంటే ఆగస్టు 15వ తేదీన ఓటీటీలోకి వచ్చినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు.

ehatv

ehatv

Next Story