నటి పరిణీతి చోప్రా, ఎంపీ రాఘవ్ చద్దాల నిశ్చితార్థం శనివారం ఢిల్లీలోని కపుర్తలా హౌస్‌లో జరిగింది. వారిద్దరూ ఈ విషయమై సోషల్ మీడియాలో ప్రకటించారు. పరిణీతి, రాఘవ్‌ల నిశ్చితార్థం జరిగిన నేపథ్యంలో ఆమె పాత ఇంటర్వ్యూ ఒకటి మళ్లీ తెరపైకి వచ్చింది. నెటిజన్లు ఆ ఇంటర్వ్యూలో ఆమె చేసిన కామెంట్లకు పలు రకాలుగా స్పందింస్తున్నారు.

When Parineeti Chopra described the ideal qualities she seeks in her life partner
నటి పరిణీతి చోప్రా(Parineeti Chopra), ఎంపీ రాఘవ్ చద్దా(Raghav Chadha)ల నిశ్చితార్థం శనివారం ఢిల్లీ(Delhi)లోని కపుర్తలా హౌస్(Kapurthala House)లో జరిగింది. వారిద్దరూ ఈ విషయమై సోషల్ మీడియా(Social Media)లో ప్రకటించారు. పరిణీతి, రాఘవ్‌ల నిశ్చితార్థం జరిగిన నేపథ్యంలో ఆమె పాత ఇంటర్వ్యూ ఒకటి మళ్లీ తెరపైకి వచ్చింది. నెటిజన్లు ఆ ఇంటర్వ్యూలో ఆమె చేసిన కామెంట్లకు పలు రకాలుగా స్పందింస్తున్నారు. ఇంటర్వ్యూ(interview)లో ఆమె తన జీవిత భాగస్వామిలో ఎలాంటి లక్షణాలను ఉండాలనుకుంటుందో మాట్లాడుతోంది. 2014లో Rediff.comకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పరిణీతి మాట్లాడుతూ "నాకు ప్రేమించడానికి బలమైన వ్యక్తి కావాలి. నా భాగస్వామికి హ్యూమర్ టచ్ ఉండాలి, సెన్సిబుల్‌గా, మెచ్యూర్డ్‌గా ఉండాలి, అలాంటి వ్యక్తి ఉండి.. నాకంటే 20 ఏళ్లు పెద్దైనా పర్వాలేదు.. చేసుకుంటా అంటూ సమాధానమిచ్చింది. మరో ప్రశ్నకు సమాధానమిస్తూ.. నేను రాజకీయ నాయకుడి(Politician)ని మాత్రం అసలే పెళ్లి(Marriage) చేసుకోను అంటుంది.
రొమాంటిక్ డేట్(Romantic Date) గురించి నటిని అడిగినప్పుడు. అందుకు ఆమె.. "నేనెప్పుడూ రొమాంటిక్ డేట్‌కి వెళ్లలేదు. ప్రేమలో పడితే డేట్‌కి వెళ్లడం ఇష్టం.. ప్రేమలో పడినప్పుడు మాత్రమే నేను డేటింగ్ చేస్తాను.. మిస్సవ్వను అంటూ సమాధానమిచ్చింది. ఇంటర్వ్యూ ఐన తొమ్మిదేళ్ల తర్వాత పరిణీతి.. రాఘవ్ చద్దాలో తన ఆదర్శ జీవిత భాగస్వామిని కనుగొంది. ఇద్దరికీ 34 ఏళ్లు కాగా.. 1988లో కొద్ది రోజుల తేడాతో జన్మించారు. పరిణీతి అక్టోబర్ 22న పుట్టినరోజు జరుపుకుంటే.. రాఘవ్ చద్దా నవంబర్ 11న బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటారు.
