మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఇప్పుడు న్యూస్‌ మేకర్‌ అయ్యారు. సోషల్‌ మీడియాలో అయితే హాట్‌టాపిక్‌గా మారారు. ఈ గుజరాతీ అమ్మాయి తెలుగులోనే కాదు, తమిళం, హిందీ భాషలలో కూడా నటించారు. ప్రస్తుతం తమన్నా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సరసన జైలర్‌ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 10వ తేదీన విడుదల కాబోతున్నది. ఈ సినిమాతో పాటు అరణ్మణై -4లో కూడా నటిస్తున్నారు. ఇటీవలే తన బాయ్‌ఫ్రెండ్‌ గురించి బహిరంగ ప్రకటన చేశారు.

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా (Tamanna bhatia) ఇప్పుడు న్యూస్‌ మేకర్‌ అయ్యారు. సోషల్‌ మీడియాలో అయితే హాట్‌టాపిక్‌గా మారారు. ఈ గుజరాతీ అమ్మాయి తెలుగులోనే కాదు, తమిళం, హిందీ భాషలలో కూడా నటించారు. ప్రస్తుతం తమన్నా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ (Rajinikanth) సరసన జైలర్‌ (Jailer) సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 10వ తేదీన విడుదల కాబోతున్నది. ఈ సినిమాతో పాటు అరణ్మణై -4లో కూడా నటిస్తున్నారు. ఇటీవలే తన బాయ్‌ఫ్రెండ్‌ గురించి బహిరంగ ప్రకటన చేశారు. దీనిపై కూడా సోషల్‌ మీడియాలో వాడి వేడి చర్చ జరిగింది. ఇక హిందీలో నటిస్తున్న జీ కర్దా వెబ్‌ సిరీస్‌ ఇప్పుడు వార్తల్లో నిలిచింది. ఈ వెబ్‌ సిరీస్‌లో తమన్నా లిప్‌లాక్‌ సీన్‌పై ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు. హద్దులు మీరిన బెడ్‌రూమ్‌ సీన్స్‌ కూడా విమర్శలకు దారి తీస్తున్నాయి. 2016లో తమన్నా ఓ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ముద్దు సన్నివేశాలలో నటించను అని ప్రకటించిన తమన్నా ఇప్పుడు అలాంటి సీన్లలో శ్రుతిమించి నటించడంతో నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇక ఈమె నటించిన లస్ట్‌ స్టోరీస్‌-2 (LUST STORIES 2) వెబ్‌ సిరీస్‌ కూడా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఇందులో కూడా శ్రుతి మించిన అందాల ఆరబోతలు ఉన్నాయి. ఈ వెబ్‌ సిరీస్‌ ప్రమోషన్‌ కార్యక్రమంలో పాల్గొంటున్న తమన్నా ఓ ఇంటర్వ్యూలో తన లిప్‌లాక్‌, బెడ్‌రూమ్‌ సీన్లపై రియాక్టయ్యారు. ఇప్పుడెందుకో తన లిప్‌లాక్‌, బెడ్‌రూమ్‌ సన్నివేశాల గురించి తెగ విమర్శలు గుప్పిస్తున్నారని, కథకు అవసరం అనిపించడంతో తాను ఆ సన్నివేశాలు అలా నటించానని తమన్నా వివరించారు. 2023లో కూడా ఇంకా బెడ్‌రూమ్‌ సన్నివేశాల గురించి విమర్శించడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. 'మొన్నటి వరకు ఇంకా పెళ్లి కాలేదని నన్ను విమర్శించిన వాళ్లు ఇటీవల నా బాయ్‌ఫ్రెండ్‌ గురించి ప్రకటించడంతో దీనిపై కూడా రాద్దాంతం చేస్తున్నారని, అసలు ఈ సమాజం ఎందుకు ఇలా తయారవుతున్నదో అర్థం కావడం లేదని తమన్నా అన్నారు.

Updated On 30 Jun 2023 1:23 AM GMT
Ehatv

Ehatv

Next Story