నందమూరి బాలకృష్ణ(Balakrishna) మార్కెట్‌ ఇప్పుడు బాగా పెరిగింది. ఒకప్పుడు ఆయన మార్కెట్ కేవలం 30 కోట్ల రూపాయలు మాత్రమే. అప్పట్లో ఎంత బ్లాక్‌బస్టర్‌ సినిమా అయినా కూడా బాలయ్య సినిమాకు ఓపెనింగ్స్‌ పెద్దగా ఉండేవి కావు. ఇప్పుడు సీన్‌ మారింది. ఒకప్పుడు మొత్తం సినిమా కలెక్షన్లు 30 కోట్ల రూపాయలు ఉంటే, సంక్రాంతికి విడుదలై వీరసింహారెడ్డి(Veera Simha Reddy) మొదటి రోజే 32 కోట్ల రూపాయలను వసూలు చేసింది.

నందమూరి బాలకృష్ణ(Balakrishna) మార్కెట్‌ ఇప్పుడు బాగా పెరిగింది. ఒకప్పుడు ఆయన మార్కెట్ కేవలం 30 కోట్ల రూపాయలు మాత్రమే. అప్పట్లో ఎంత బ్లాక్‌బస్టర్‌ సినిమా అయినా కూడా బాలయ్య సినిమాకు ఓపెనింగ్స్‌ పెద్దగా ఉండేవి కావు. ఇప్పుడు సీన్‌ మారింది. ఒకప్పుడు మొత్తం సినిమా కలెక్షన్లు 30 కోట్ల రూపాయలు ఉంటే, సంక్రాంతికి విడుదలై వీరసింహారెడ్డి(Veera Simha Reddy) మొదటి రోజే 32 కోట్ల రూపాయలను వసూలు చేసింది. దీన్ని బట్టి బాలకృష్ణ మార్కెట్ ఏ రేంజ్‌లో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. అసలు ఈ లెవల్లో బాలయ్య మార్కెట్‌ ఎలా పెరిగిందో చాలా మందికి అర్థం కావడం లేదు. పెరిగితే 30 కోట్ల నుంచి 40 కోట్ల రూపాయలవ్వాలి. కానీ ఒకేసారి 30 కోట్ల నుంచి 100 కోట్ల రూపాయలకు ఎలా పెరుగుతుందన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. లెజెండ్(Legend) వంటి బ్లాక్‌బస్టర్ సినిమాకు కూడా అప్పట్లో 40 కోట్ల రూపాయలు దాటలేదు. ఆ తర్వాత గౌతమిపుత్ర శాతకర్ణి( Gautamiputra Satakarni) కూడా 45 కోట్ల రూపాయల దగ్గరే ఆగిపోయింది. అలాంటిది అఖండ(Akhanda) మాత్రం కరోనా సమయంలో వచ్చి ఏకంగా 120 కోట్ల రూపాయల గ్రాస్.. 75 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది. ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్లు చూసి ట్రేడ్ కూడా షాక్ అయిపోయింది. అసలు ఈ రేంజ్ కలెక్షన్లు ఏమిటి? అసలు ఇది బాలయ్య సినిమానేనా అనే అనుమానాలు కూడా వచ్చాయి. పైగా పుష్ప లాంటి సినిమా వచ్చినా కూడా దాన్ని తట్టుకుని నిలబడగలిగింది అఖండ. ఇక ఈ ఏడాది వచ్చిన వీరసింహారెడ్డి కూడా అంతే. సంక్రాంతికి చిరంజీవి(Chiranjeevi) వాల్తేరు వీరయ్య(Waltair Veerayya) ఉన్నా.. దానికి ఫుల్ పాజటివ్ టాక్ వచ్చి.. తన సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చినా కూడా బాలయ్య మాత్రం తగ్గలేదు. దీనికి కూడా 130 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. మొదటిరోజే 64 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు చేసింది వీరసింహారెడ్డి. దీన్నిబట్టి బాలయ్య రేంజ్ అర్థమైపోతోంది. ఇప్పుడు భగవంత్ కేసరి(Bhagavanth Kesari)పై కూడా అంచనాలు మామూలుగా లేవు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అంతా కలిపి దాదాపు 150 కోట్ల రూపాయలు జరుగుతుంది. అందులోనే డిజిటల్ రైట్స్ కూడా ఉన్నాయి. వీటన్నింటికీ కారణం బాలయ్య ఏజ్‌కు తగ్గ పాత్రలు చేస్తుండటమే. వయసుకు తగ్గ పాత్రలు చేస్తుంటే.. ఆడియన్స్ కూడా బాగా కనెక్ట్ అవుతున్నారు. ఇప్పుడు బాబీ(Bobby) సినిమాలోనూ 70 ఏండ్ల వ్యక్తిగా నటించబోతున్నారు బాలయ్య. అనిల్ రావిపూడి(Anil Ravipudi) సినిమాలోనూ బాలయ్య మధ్య వయస్కుడిగానే నటిస్తున్నారు. మొత్తానికి బాలయ్య ఈ తరహా పాత్రలు చేస్తుండటంతోనే ఈ మధ్య సక్సెస్ రేషియోతో పాటు మార్కెట్ కూడా డబుల్ అయిపోయిందని ట్రేడ్‌వర్గాలు చెబుతున్నాయి.

Updated On 6 July 2023 5:14 AM GMT
Ehatv

Ehatv

Next Story