సాలిడ్ హిట్ కోసం ఎదరు చూస్తున్నాడు నాగచైతన్య. ఈసారి ఎలాగైనా సాధించాలి అని పట్టుదలతో ఉన్నాడు.

సాలిడ్ హిట్ కోసం ఎదరు చూస్తున్నాడు నాగచైతన్య. ఈసారి ఎలాగైనా సాధించాలి అని పట్టుదలతో ఉన్నాడు. తన కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమా కావడం.. ప్రయోగాత్మకపాత్ర చేస్తున్నాడు చైతు. ఈ క్రారెక్టర్ కోసం దాదాపు ఏడాదికిపైగా ప్రత్యేకంగా పనిచేశాడు చైతు. మరి ఇంత కష్టపడ్డ ఈమూవీ కోసం నాగచైతన్య(Naga Chaitanya) ఎంత రెయ్యునరేషన్ తీసుకుని ఉంటాడు.

అక్కినేని నాగచైతన్య నటించిన ది మోస్ట్ అవైటెడ్ మూవీ ‘తండేల్(Thandel ). సాయి పల్లవి (Sai Pallavi)హీరోయిన్ గా నటించిన ఈసినిమా పిబ్రవరి 7న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. చందూ మొండేటి డైరెక్ట్ చేసిన ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ మూవీక గీతాఆర్ట్స్(Geetha Arts) బ్యానర్ పై అల్లు అరవింద్ (Allu Aravind)నిర్మించారు. ఈసినిమాకు దాదాపు 80 కోట్టు బడ్జెట్ పెట్టినట్టు తెలుస్తోంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో మూవీపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెంచేశాయి.

ఈసారి పక్కాగా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తానన్న థిమా నాగచైతన్యలో ఉంది. అటు మూవీ టీమ్ కూడా ఈ విషయంలో ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే, ఈ సినిమాలో నాగచైతన్య పవర్‌ఫుల్ పాత్రలో నటించాడని.. తండేల్ రాజు పాత్ర ప్రేక్షకులకు చాలా ఏళ్లు గుర్తుండిపోవడం ఖాయమని మేకర్స్ కాన్ఫిడెంట్ వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ సినిమాలో నటించినందుకు నాగచైతన్య ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడన్న విషయంపై చర్చ నడుస్తోంది.

ఈ సినిమా కోసం నాగచైతన్య చాలా టైమ్ ఇచ్చాడన్నది అందరికి తెలిసిన విషయమే. దాంతో చైతూ రెగ్యులర్‌గా తీసుకునే రెమ్యునరేషన్ కంటే ఎక్కువే తీసుకుని ఉంటాడంటున్నారు. ఎక్కవ అనడం కంటే.. డబుల్ తీసుకుని ఉంటారని టాక్ నడుస్తోంది. అయితే ఒక వర్గం మాత్రం ఇందులో నిజం లేదు చైతూ హిట్ కోసం చూస్తున్నాడు కాబట్టి.. అతను స్వతహాగా ఈసినిమా కోసం ఎక్కవటైమ్ ఇచ్చాడట. ఈరకంగా చూసుకుంటే.. నాగచైతన్య 10 కోట్లు తీసుకున్నాడని టాక్. ఇక ఈసినిమాకు దేవిశ్రీ ప్రసాద్(Devisri Prasad) సంగీతం అందించగా.. మూవీ నుంచి రిలీజ్ అయిన బుజ్జితల్లి(Bujji Thalli) పాటకు అద్బుతమైన రెస్పాన్స్ వచ్చింది.

ehatv

ehatv

Next Story