టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్ కోహ్లి(Virat Kohli)-బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ(Anushka sharma) దంపతులకు పండంటి బాబు పుట్టిన విషయం తెలిసిందే! ఫిబ్రవరి 15వ తేదీన మగబిడ్డ పుట్టాడంటూ ఈ జంట సోషల్‌ మీడియా(Social media) వేదికగా తెలిపారు. తమ బాబుకు అకాయ్‌(Akay) అని పేరు పెట్టినట్టు ప్రకటించారు. పేరు కాస్త కొత్తగా ఉండటంతో అకాయ్‌ పేరుకు అర్థమేమిటో తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ పెరిగింది. ఒకప్పుడు అకాయ్‌ ఎలక్ట్రానిక్‌ వస్తువులకు పెట్టింది పేరు.

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్ కోహ్లి(Virat Kohli)-బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ(Anushka sharma) దంపతులకు పండంటి బాబు పుట్టిన విషయం తెలిసిందే! ఫిబ్రవరి 15వ తేదీన మగబిడ్డ పుట్టాడంటూ ఈ జంట సోషల్‌ మీడియా(Social media) వేదికగా తెలిపారు. తమ బాబుకు అకాయ్‌(Akay) అని పేరు పెట్టినట్టు ప్రకటించారు. పేరు కాస్త కొత్తగా ఉండటంతో అకాయ్‌ పేరుకు అర్థమేమిటో తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ పెరిగింది. ఒకప్పుడు అకాయ్‌ ఎలక్ట్రానిక్‌ వస్తువులకు పెట్టింది పేరు. అదలా ఉంచితే కోహ్లీ ప్రకటన తర్వాత ఈ పేరుకు అర్థంపై సోషల్‌ మీడియాలో నెటిజన్లు తమకు తోచినది పోస్ట్‌ చేస్తున్నారు. హిందీ పదం కాయ నుంచి ఈ పేరు వచ్చిందని, కాయ అంటే శరీరం అని చెబుతున్నారు. అకాయ్‌ అంటే భౌతిక శరీరాన్ని మించినది అని అర్థం చెబుతున్నారు. అయితే టర్కిష్‌ భాషలో అకాయ్‌ అంటే ప్రకాశవంతమైన చంద్రుడు అని అర్థం. అయితే తమ బాబుకి అకాయ్‌ అని పేరు పెట్టడానికి విరాట్ కోహ్లీ - అనుష్క శర్మ దంపతులు ఏ పదాన్ని మూలంగా తీసుకున్నారో ఇంకా చెప్పలేదు. వారు సోషల్ మీడియాలో ఏం పోస్టు పెట్టారంటే..'ఫిబ్రవరి 15న మేము మా బేబీ బాయ్ అకాయ్.. వామికా చిట్టి సోదరుడిని ఈ ప్రపంచంలోకి స్వాగతించామని అంతులేని ఆనందం, ప్రేమతో నిండిన హృదయంతో ప్రతిఒక్కరికీ తెలియజేస్తున్నందుకు సంతోషిస్తున్నాం. మా జీవితాల్లోనే అందమైన ఈ క్షణంలో మీ ఆశీర్వాదాలు, శుభాకాంక్షలను ఆశిస్తున్నాం. మా గోప్యతను గౌరవించమని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం’ అని పోస్ట్‌ చేశారు. ఇదిలా ఉంటే, ఇన్‌స్టాగ్రామ్‌లో విరాట్ కోహ్లీ పెట్టిన పోస్ట్ బాగా వైరల్‌ అవుతోంది గంట వ్యవధిలో మిలియన్లకు పైగా లైక్‌లను అందుకుంది. అనేక మంది సెలెబ్రిటీలతో పాటు అభిమానులు కూడా శుభాకాంక్షలు చెబుతున్నారు.

Updated On 21 Feb 2024 12:50 AM GMT
Ehatv

Ehatv

Next Story