బాహుబలి ఆర్ఆర్ఆర్ సినిమాలతో తెలుగు సినిమా స్థాయిని హాలీవుడ్ రేంజ్ కు తీసుకెళ్ళాడు.

బాహుబలి ఆర్ఆర్ఆర్ సినిమాలతో తెలుగు సినిమా స్థాయిని హాలీవుడ్ రేంజ్ కు తీసుకెళ్ళాడు. టాలీవుడ్ ను తక్కువ చేసి చూపించిన బాలీవుడ్, కోలీవుడ్ పరిశ్రమలకు తనసినిమాలతో బుద్ది చెప్పాడు జక్కన్న. అంతే కాదు ఇప్పుడు ఓవర్ ఆల్ ఇండియాలో ఎంత పెద్ద స్టార్ హీరోఅయినా.. రాజమౌళితో సినిమా కోసం ఆరాటపడాల్సిందే. ఆయన అపాయింట్మెంట్ కోసం ఎదురు చూడాల్సిందే. రాజమౌళి రేంజ్ ప్రస్తుతం అలా ఉంది మరి. కాని జక్కన్న మాత్రం అలా ఎప్పుడూ బిహేవ్ చేయలేదు.

అంత పెద్ద డైరెక్టర్ వేల కోట్ల వసూళ్ళు చూసిన దర్శకుడు. ఆస్కార్ ను కూడా సాధించినా.. రాజమౌళి చాలా సాధారణంగా కనిపిస్తుంటాడు. ఇంత సాధించిన మనిషి ఎంత పొగరు చూపించాలి. ఎంత దర్జా చూపించాలి. కాని రాజమౌళి మాత్రం చాలా సింపుల్ గా ఉంటాడు. గర్వం ఏకోశానా కనిపించదు రాజమౌళిలో. అసలు ఈమనిషేనా ఇంత పెద్ద సినిమాలు చేసింది అని చాలామందికి డౌట్ కూడా వస్తుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంటాడు జక్కన్న. ఆయన కోప్పడటం చాలామంది చూసి ఉండరు. మరి అటువంటి రాజమౌళికి కోపం వస్తుందా..? నిజంగా కోపం వస్తే ఆయన ఏం చేస్తారు..? ఏ సందర్భంలో కోపం వస్తుంది...? ఆయన కోపం చూసిన వారు ఎవరు..? ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్.

గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్, రామ్ చరణ్ రాజమౌళి గురించి మాట్లాడారు. ఆయనకు కోపం వస్తుందని. కోపం వస్తే రాజమౌళి వెంటనే మైక్ విసిరేస్తారని వారు అన్నారు. రాజమౌళికి కోపం వస్తే మైక్ విరిగిపోతుంది.. విసిరికొడతారు అని అన్నాడు రామ్ చరణ్. ఎన్టీఆర్ మాట్లాడుతూ.. జక్కన్నకు కోపం వస్తే.. చేతిలో ఉన్న మైక్ విరిగిపోవడంతో పాటు.. వెంటే ఓ భూతు మాట కకూడా అంటాడు. అప్పట్లో జంద్యాల సినిమాలో బూతుబూతుబూతు.. అని బ్యాక్ గ్రౌండ్ కోరస్ వస్తుంది కదా.. అలా చెవులు మూసుకునేలా ఓ మాట అంటారు అని ఎన్టీఆర్ అసలు విషయం బయటపెట్టారు.

ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబు సినిమా కోసం గట్టిగా కష్టపడుతున్నాడు. త్వరలో ఈమూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. పాన్ వరల్డ్ మూవీగా రూపొందుతున్న ఈసినిమా బడ్జెట్ 1000 కోట్లు పైనే అంటున్నారు. నిజమెంతో తెలియాల్సి ఉంది.

ehatv

ehatv

Next Story