ఎన్టీఆర్(Jr NTR) దేవర(Devara) మూవీ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. రిలీజ్ కు రెండు నెలల టైమ్ మాత్రమే ఉంది. లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ రీసెంట్ గా స్టార్ట్ అయ్యింది. న్యూ ఇయర్, సంక్రాంతి వెకేషన్(Sankranti Vacation) కోసం ఎన్టీఆర్ దాదాపు నెల రోజులుగా షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకున్నాడు. లాంటికారణాలతో తారక్ దాదాపు 20 రోజులుగా షూటింగ్ కు దూరంగా ఉంటున్నాడు.

ఎన్టీఆర్(Jr NTR) దేవర(Devara) మూవీ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. రిలీజ్ కు రెండు నెలల టైమ్ మాత్రమే ఉంది. లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ రీసెంట్ గా స్టార్ట్ అయ్యింది. న్యూ ఇయర్, సంక్రాంతి వెకేషన్(Sankranti Vacation) కోసం ఎన్టీఆర్ దాదాపు నెల రోజులుగా షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకున్నాడు. లాంటికారణాలతో తారక్ దాదాపు 20 రోజులుగా షూటింగ్ కు దూరంగా ఉంటున్నాడు. ఇక తాజాగా ఈమూవీ షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది. అల్యూమినియం ఫ్యాక్టరీలో(Aluminium) షూటింగ్ జరుగుతుంది. ఈ షెడ్యూల్ తో టాకీ పార్ట్ పూర్తి అవుతుంది. ఇక సాంగ్స్ షూటింగ్ పెండింగ్ లో ఉంటాయి.

ఈమూవీ సాంగ్స్ షూటింగ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదని తెలుస్తోంది. ఈసినిమాకు అనిరుధ్(anirudh) మ్యూజిక్ అందిస్తున్నాడు. అయితే తమిళ సినిమాల బిజీలో ఉన్న యంగ్ మ్యూజిక్ డైరెక్టర్.. దేవర సాంగ్స్ ను లేట్ చేస్తూ వస్తున్నాడట. అనిరుథ్ లేట్ అయినా.. మంచి ట్యూన్స్ ఇస్తాడన్న నమ్మకంతో ఉన్నారు దేవర బ్యాచ్. అందుకే అనిరుధ్ ను కదిలించడంలేదు. కాని అతను సాంగ్స్ ఇస్తే.. షూటింగ్ ను కంప్లీట్ చేసే అవకాశం ఉంటుది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ ట్యూన్స్ ఇవ్వగానే.. షూటింగ్ కు వెళ్లి..త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేయాలని చూస్తున్నారు.

ఎలా చూసుకున్నా.. ఎప్రిల్ 5న దేవర పార్ట్ 1 రావడం మాత్రం ఖాయం అంటున్నారు మేకర్స్. చూడాలి ఇంత ధైర్యంగా ఉన్న మూవీ టీమ్.. ఎంత వరకూ పని ఫినిష్ చేస్తుందో..? అటు తారక్ కూడా అనిరుధ్ మ్యూజిక్ పై నమ్మకంతో ఉన్నాడట. కాస్త లేట్ అయినా.. అనిరుధ్ ను కదిలించవద్దని టీమ్ కు చెప్పినట్టు తెలుస్తోంది. ఇక ఈమూవీలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. దేవర సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది జాన్వీ.

Updated On 20 Jan 2024 1:26 AM GMT
Ehatv

Ehatv

Next Story