అతిలోకసుందరి శ్రీదేవి (Heroin Sridevi) అర్ధాంతరంగా తనువు చాలించింది. ఆమె ప్రస్తావన లేకుండా భారత సినిమా చరిత్ర ఉండదు. బాలనటిగా వెండితెరకు పరిచయమైన శ్రీదేవి అటు పిమ్మట టాలీవుడ్‌లోనూ, బాలీవుడ్‌లోనూ స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగారు.

అతిలోకసుందరి శ్రీదేవి (Heroin Sridevi) అర్ధాంతరంగా తనువు చాలించింది. ఆమె ప్రస్తావన లేకుండా భారత సినిమా చరిత్ర ఉండదు. బాలనటిగా వెండితెరకు పరిచయమైన శ్రీదేవి అటు పిమ్మట టాలీవుడ్‌లోనూ, బాలీవుడ్‌లోనూ స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగారు. ఆ అందాలతార శ్రీదేవి ఆస్తులు బాగానే కూడబెట్టారు. చెన్నైలో (Chennai) కూడా ఆమెకు విలువైన ఆస్తులు ఉన్నాయి. అందులో ఓ విలాసవంతమైన భవంతి కూడా ఉంది. బోనీకపూర్‌తో పెళ్లయిన తర్వాత మొదట కొన్నది ఈ ఇంటినే! ఎంతో ఖరీదైన ఆ భవంతికి ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ భవంతిలో మనం ఉండే ఛాన్సు వచ్చింది. ఉండటం అంటే పర్మినెంట్‌గా అనుకునేరు. కాదు. ఆ మాన్షన్‌ను రెంట్‌కు ఇస్తున్నారు. అయితే ఇద్దరు గెస్టులు మాత్రమే ఉండగలరు. వారికి ఓ బెడ్‌రూమ్‌, ఓ బాత్‌రూమ్‌ లభిస్తుందని రెంటల్‌ సంస్థ చెబుతోంది. ఈ నెల 12వ తేదీ నుంచి బుకింగ్స్‌ మొదలుకానున్నాయి. కేవలం ఒక రోజు రాత్రి బస చేసే ఆప్షన్‌ కూడా ఉంది. ఆ భవంతిలో బస చేసేవారికి దక్షిణాది వంటకాలను రచి చూపిస్తారు. 2018లో శ్రీదేవి చనిపోయింది. ఆ తర్వాత ఆ భవంతిని బోనీ కపూర్‌ (BoniKapoor) పునరుద్దరించారు. 2022లో జాన్వీ కపూర్‌ (Janvi kapoor) ఈ ఇంటి హోమ్‌ టూర్‌ చేసి వోగ్‌ ఇండియా యూట్యూబ్‌ ద్వారా అందరికి పరిచయం చేసింది. ప్యాలెస్‌ను తలపించే ఆ భవంతిలో ఎక్కువగా పెయింటింగ్సే కనిపించాయి. శ్రీదేవి, బోనీ కపూర్‌కు సంబంధించిన పలు అరుదైన ఫొటోలను కూడా చూడవచ్చు.

Updated On 2 May 2024 6:34 AM GMT
Ehatv

Ehatv

Next Story