మిచౌంగ్ తుఫాన్ తాకిడికి చెన్నై మహానగరం అతలాకుతలమయ్యింది. అనేక ప్రాంతాలు నీట మునిగాయి. జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమయ్యింది. వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ చాలా ప్రాంతాలలో వరద నీరు పూర్తిగా తొలగిపోలేదు.
మిచౌంగ్ తుఫాన్ తాకిడికి చెన్నై మహానగరం అతలాకుతలమయ్యింది. అనేక ప్రాంతాలు నీట మునిగాయి. జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమయ్యింది. వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ చాలా ప్రాంతాలలో వరద నీరు పూర్తిగా తొలగిపోలేదు. ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుననారు. నిత్యావసర వస్తువుల కొరత, కరెంట్, ఆహారం, నీరు అందక అల్లాడిపోతున్నారు. సామాన్య ప్రజలే కాదు, సెలబ్రెటీలకు కూడా ఇబ్బందులు తప్పడం లేదు. సూపర్‌స్టార్ రజనీకాంత్ ఇంటిన కూడా వరద నీరు చుట్టుముట్టింది. చెన్నైలోని పోయెస్ గార్డెన్ ప్రాంతంలో ఉన్న రజనీకాంత్ ఇంటి బయట వరద నీరు నిలిచిపోయింది. రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. రజనీకాంత్ ఇంటి దగ్గర వరద నీటికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వరద బాధితులను ఆదుకోవడానికి సినీతారలు నడుం బిగించారు. తమ స్థాయికి తగినట్టుగా విరాళాలు ఇస్తున్నారు.