అలనాటి అందాలతార వహీదా రెహమాన్(Waheeda Rehman ) దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి(Dadasaheb Phalke Award) ఎంపిక అయ్యారు. చిత్రపరిశ్రమకు చేసిన సేవలకుగానూ ఆమెకు ఈ సినీ అత్యున్నత పురస్కారం అందించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
డాక్టర్ కాబోయి యాక్టర్ అయిన వారిలో వహీదా ఒకరు. 1938 ఫిబ్రవరి 3న తమిళనాడులోని(Tamilnadu) చెంగల్పట్టులో జన్మించారు.
అలనాటి అందాలతార వహీదా రెహమాన్(Waheeda Rehman ) దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి(Dadasaheb Phalke Award) ఎంపిక అయ్యారు. చిత్రపరిశ్రమకు చేసిన సేవలకుగానూ ఆమెకు ఈ సినీ అత్యున్నత పురస్కారం అందించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
డాక్టర్ కాబోయి యాక్టర్ అయిన వారిలో వహీదా ఒకరు. 1938 ఫిబ్రవరి 3న తమిళనాడులోని(Tamilnadu) చెంగల్పట్టులో జన్మించారు. చాలా మంది వహీదా రెహమాన్ తెలుగమ్మాయి అని అంటారు కానీ ఆమె తమిళ ముస్లిము. ఆమె తండ్రి ఉద్యోగరీత్యా ఆంధ్రలో చాలా కాలం గడిపారు. రాజమండ్రిలో కూడా ఉన్నారు. రోజులు మారాయి, జయసింహ సినిమాల నాటికి ఆయన విజయవాడలో మునిసిపల్ కమిషనర్‌గా పని చేస్తున్నారు. తెలుగు ప్రాంతాలలో పెరగడం వల్ల వహీదాకు తెలుగు బాగా వచ్చు. రోజులు మారాయి సినిమాలో ఏరువాక సాగారోయ్ అన్న పాటకు నర్తించిన వహీదాకు ఆ వెంటనే ఎన్టీఆర్ సంత సినిమా జయసింహలో రెండో కథానాయిక పాత్ర దొరికింది. అందులో రాజకుమారి పాత్రలో ఓ కొత్త నటిని తీసుకుకోవాలని ఎన్టీఆర్ అనుకున్నారు. ఆ విధంగా ఆ పాత్ర వహీదా రెహమాన్‌ను వరించింది. అయితే అప్పటికే రోజులు మారాయి సినిమా విడుదల కావడంతో అదే వహీదా రెహమాన్ మొదటి చిత్రంగా మారింది.ఆ తర్వాత బాలీవుడ్‌లో అడుగపెట్టారు. ప్యాసా, కాగజ్‌కే పూల్, చౌదవికా చాంద్, సాహెబ్ బీవీ ఔర్ గులాం, గైడ్, కామోషి సినిమాలోల వహీదా అద్భుతంగా నటించారు. 1971లో వచ్చిన రేష్మా ఔర్ షేరా సినిమాకుగాను ఆమెకు జాతీయస్థాయిలో ఉత్తమ నటి అవార్డు లభించింది. 1972లో పద్మశ్రీ పురస్కారం, 2011లో పద్మభూషణ్ పురస్కారం ఆమెకు లభించాయి.