✕
Love killed Them : ఇద్దరు అద్భుతమైన కళాకారులను బలి తీసుకున్న ప్రేమ!
By EhatvPublished on 27 Sep 2023 4:32 AM GMT
సొంత సినిమాలకు నయ్యర్ చాలా కాలం పని చేయలేదు. 1958లో వచ్చిన 12 ఓ క్లాక్ సినిమాలో గురుదత్, వహీదా రెహమాన్‌లు హీరో హీరోయిన్లు. దానికి సంగీతాన్ని ఇచ్చింది ఓ.పి.నయ్యరే! కానీ సినిమా తీసింది మాత్రం జి.పి.సిప్పి. గురుదత్ వహీదా ప్రేమ బ్రేకప్ అయ్యాక తీసిన బహారే ఫిర్ బీ ఆయేంగే సినిమాకు సంగీత దర్శకత్వం వహించడానికి తిరిగి వచ్చాడు ఓ.పి.నయ్యర్.

x
Waheeda Rehman
-
- గురుదత్ దర్శకత్వం వహించిన మొదటి సినిమా బాజీ(Baji). నవకేతన్ బ్యానర్లో వచ్చిన ఈ సినిమాలో దేవానంద్(Dev Anand) హీరో! ఈ సినిమా సూపర్‌డూపర్ హిట్టయ్యింది. ఆ తర్వాత దేవానంద్ హీరోగానే జాల్(Jaal) సినిమా రూపొందించాడు గురుదత్(Gurudath). అది కూడా హిట్టవ్వడంతో గురుదత్ ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాడు. అనంతరం తనే హీరోగా బాజ్ అనే సినిమా తెరకెక్కించాడు. బాజ్ తర్వాత 1954లో సొంతంగా నిర్మించి దర్శకత్వం వహించిన ఆర్‌పార్ కూడా విజయవంతమయ్యింది. ఆ మరుసటి ఏడాది మిస్టర్ అండ్ మిసెస్ 55 తీశాడు. అది కూడా సక్సెసయ్యింది. 1956లో దేవానంద్, షకీలాలతో సీఐడీ ప్లాన్ చేశాడు గురుదత్. దర్శకత్వ బాధ్యతలను తన శిష్యుడు రాజ్ ఖోస్లాకు అప్పగించి తను పర్యవేక్షించాడు.
-
- ఓ రోజు గీతను కల్యాణ్‌లోని హాజీ మలాంగ్ బాబా సమాధి దగ్గరకు తీసుకెళ్లి నన్ను పెళ్లి చేసుకుంటావో, మీ అమ్మానాన్నా చెప్పిన మాట వింటావో తేల్చి చెప్పని గట్టిగా అడిగేశాడు. గీత పెళ్లికి ఓకే చెప్పింది. 1953, మే 26న బెంగాలీ పద్దతిలో వివాహం జరిగింది. గీతారాయ్(Geetha Roy) కాస్తా గీతాదత్ అయింది. ఇది జరిగిన కొన్నాళ్లకే గురుదత్లోని పురుషుడు బయటకొచ్చాడు. గీతాను బయటి సినిమాల్లో పాడకుండా కట్టడి చేశాడు. వీరిద్దరి వైవాహిక జీవితంలో కలతలు మొదలయ్యాయి.ఆ తర్వాత తను ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి తీసుకొచ్చిన వహీదా రెహమాన్ కూడా గురుదత్ కుటుంబంలో కలతలు రావడానికి కారణమైంది.
-
- గురుదత్ అసలు పేరు వసంత్ కుమార్ శివశంకర్ పడుకోనె(Vasanth Kumar shivashankar Padukone). పుట్టింది బెంగళూరులో. పెరిగింది మాత్రం కోల్‌కతాలో. పేరు ప్రతిష్టలను గడించింది బొంబాయిలో.1951లో బాజీ సినిమా పాటల రికార్డింగ్ టైమ్‌లో గీతారాయ్ని చూసిన గురుదత్ మనసు పారేసుకున్నాడు.తను ప్రసిద్ధ గాయకురాలైనా, అప్పటికి గురుదత్ పేరులేని దర్శకుడైనా ఆమె కూడా గురుదత్ను అభిమానించింది. కానీ ఆమె సంపాదన మీద ఆధారపడిన తల్లిదండ్రులు మాత్రం వివాహానికి ఒప్పుకోలేదు. అలా మూడేళ్లు గడిచాయి. అప్పటికీ గురుదత్ కూడా డైరెక్టర్‌గా ఎస్టాబ్లిష్ అయ్యాడు.
-
- తాను ప్రాణప్రదంగా ప్రేమించే పాటను వదిలేయాల్సి వచ్చినందుకు కుంగిపోయింది.గురుదత్ నిర్లక్ష్యం ఆమెను మరింత బాధించింది. గీతాదత్ కూడా మద్యానికి అలవాటు పడింది. అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంది.1972లో తన 41వ యేట కన్నుమూసింది. ప్రేమ ఎంత ప్రళయాంతకం? ఇద్దరు అద్భుతమైన కళాకారులను అది బలి తీసుకుంది. గురుదత్ జీవితంలో వహీదా ఎంటర్కాకుంటే ఆయన్నుంచి ఇంకొన్ని మహాద్బుతమైన చిత్రరాజాలు వచ్చివుండేవి! గురుదత్ సగటు మగడిలా ప్రవర్తించకుండా ఉండి ఉంటే గీతాదత్ కోమలగళం నుంచి సమ్మోహనగీతాలు జాలువారి ఉండేవి...
-
- ఈ సినిమాలోనే వహీదా రెహమాన్‌ను(Waheeda Rehman) హిందీ తెరకు పరిచయం చేశాడు గురుదత్. వహీదాతో గురుదత్ పరిచయం చిత్రంగా జరిగింది. విజయా సంస్థ నిర్మించిన మిస్సమ్మ(Missamma) విజయవంతం కావడంతో దాన్ని హిందీలో రీమేక్ చేయాలనుకున్నాడు గురుదత్. రచయిత అబ్రార్ అల్వీ, ప్రొడక్షన్ కంట్రోలర్ గురుస్వామితో కలిసి కారులో హైదరాబాద్‌కు వచ్చారు. అనుకోకుండా అల్వీ కారు రోడ్డుపై ఉన్న గేదెను ఢీకొట్టింది. ఆ యాక్సిడెంట్లో కారు పాడయ్యింది. దాంతో ఆ ముగ్గురూ రెండు రోజుల పాటు హైదరాబాద్‌లోనే ఉండాల్సి వచ్చింది. ఓ రోజు సికింద్రాబాద్‌లోని ఓ డిస్ట్రిబ్యూటర్ ఆఫీసులో కూర్చున్న గురుదత్ చూపు కారు దిగి ఎదురుగా ఉన్న బిల్డింగ్‌లోకి వెళుతున్న ఓ అమ్మాయిపై పడింది.
-
- మూడు సినిమాలు మ్యూజికల్ హిట్స్ కావడంతో సీఐడీ సినిమాకు కూడా ఓ.పి.నయ్యర్నే సంగీత దర్శకుడిగా పెట్టుకున్నాడు గురుదత్. పైగా సినిమా సక్సెస్ అయితే కారును బహుమతిగా ఇస్తానని మాటిచ్చాడు. తనకు ఇవ్వకపోగా వహీదాకు కారు ఇవ్వడం నయ్యర్‌కు ఆగ్రహం కలిగించింది. ఆ కోపంతోనే సీఐడీ తర్వాత గురుదత్ సొంత సినిమాలకు నయ్యర్ చాలా కాలం పని చేయలేదు. 1958లో వచ్చిన 12 ఓ క్లాక్ సినిమాలో గురుదత్, వహీదా రెహమాన్‌లు హీరో హీరోయిన్లు. దానికి సంగీతాన్ని ఇచ్చింది ఓ.పి.నయ్యరే! కానీ సినిమా తీసింది మాత్రం జి.పి.సిప్పి. గురుదత్ వహీదా ప్రేమ బ్రేకప్ అయ్యాక తీసిన బహారే ఫిర్ బీ ఆయేంగే సినిమాకు సంగీత దర్శకత్వం వహించడానికి తిరిగి వచ్చాడు ఓ.పి.నయ్యర్.
-
- ఆమే వహిదా రెహమాన్. అప్పటికే ఆమె రోజులు మారాయి, జయసింహ సినిమాలలో నటించింది. అవి తెలుగు సినిమాలు కాబట్టి బాలీవుడ్‌కు ఆమె గురించి పెద్దగా తెలియదు. ఆమెను ఆఫీసుకు పిలిపించాడు గురుదత్. సాదాసీదా దుస్తులతో ఎంతో అందంగా ఉన్న వహీదాను తొలిచూపులోనే ప్రేమలో పడ్డాడు గురుదత్. ఆమెకు సీఐడీలో(CID) హీరోయిన్గా అవకాశం ఇచ్చాడు. సీఐడీ కూడా హిట్టవ్వడంతో వహీదా రెహమాన్‌కు రెమ్యునిరేషన్తో పాటు ఓ కారు కానుకగా ఇచ్చాడు. ఈ వ్యవహారం సంగీత దర్శకుడు ఓ.పి.నయ్యర్‌కు(OP Nayyar) కోపం తెప్పించింది. గీతా బాలి సిఫార్సుతో బాజ్‌కు ఓ.పి.నయ్యర్‌ను తీసుకున్నాడు గురుదత్. ఆ తర్వాత వచ్చిన ఆర్‌పార్, మిస్టర్ అండ్ మిసెస్ 55కి కూడా ఓ.పి.నయ్యరే సంగీతాన్ని అందించాడు.
-
- వహీదపై గురుదత్ అమితమైన ఇష్టాన్ని పెంచుకున్నాడు.కానీ వహీద మాత్రం గురుదత్ ప్రేమను పట్టించుకోలేదు. గురుదత్ బాగా డిస్ర్టబయ్యాడు.తాగుడికి బానిసయ్యాడు. ప్రేమ విఫలం కావడంతో గురుదత్ తీవ్రమైన మనోవ్యధకు లోనయ్యాడు. ఆ వేదనతోనే 1964, అక్టోబర్ 10న నలభై ఏళ్లయినా నిండకుండానే కన్నుమూశాడు. మద్యంలో నిద్రమాత్రలు(Sleeping Pills) కలుపుకుని సేవించడం వల్ల చనిపోయాడని డాక్టర్లు చెప్పారు. అయితే ఇది ఆత్మహత్య(Suicide) లేక యాక్సిడెంటల్ ఓవర్‌డోసా అన్నది మాత్రం ఇప్పటికీ సస్పెన్సే! గురుదత్ చనిపోయే నాటికి గీతాదత్తో వేరుగా ఉంటున్నాడు. గీతాదత్ జీవితమూ సాఫీగా సాగలేదు.

Ehatv
Next Story