చిరంజీవి మెగా హిట్స్‌లో జగదేకవీరుడు అతిలోకసుందరికి(Jagadekavirudu-athilokasundhari) ప్రత్యేక స్థానం ఉంటుంది. అప్పట్లో ఈ సినిమా సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. కె.రాఘవేంద్రరావు(K.R Raghavendar Rao) దర్శకత్వం వహించిన ఈ సినిమాను వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత అశ్వనీదత్‌(Ashwin Dutt) నిర్మించారు.

చిరంజీవి మెగా హిట్స్‌లో జగదేకవీరుడు అతిలోకసుందరికి(Jagadekavirudu-athilokasundhari) ప్రత్యేక స్థానం ఉంటుంది. అప్పట్లో ఈ సినిమా సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. కె.రాఘవేంద్రరావు(K.R Raghavendar Rao) దర్శకత్వం వహించిన ఈ సినిమాను వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత అశ్వనీదత్‌(Ashwin Dutt) నిర్మించారు. ఈ సినిమా గురించి ఇప్పుడు మళ్లీ చర్చలు మొదలయ్యాయి. కాపీ రైట్స్‌ విషయంలో సినీ వర్గాలను హెచ్చరిస్తూ ఈ సినిమాపై పూర్తి హక్కు తమకే ఉందని అధికార ట్విట్టర్‌ ఖాతాలో వైజయంతి మూవీస్‌ ఓ పోస్ట్ పెట్టింది. ఈ చిత్రానికి సంబంధించిన కథ, కథనం, పాత్రలు..

ఇలా అన్నింటిపై కాపీరైట్‌(Copyrights) హక్కులు తమకే ఉన్నాయని, దీనికి సంబంధించిన రీమేక్‌లు(Remake), ప్రీక్వెల్స్‌, సీక్వెల్స్‌, వెబ్‌సిరీస్‌లు తీర్చిదిద్దే హక్కు కేవలం తమకు మాత్రమే ఉందని, తాము ఎవరికీ హక్కులు ఇవ్వలేదని, కాపీరైట్‌ హక్కులను ఉల్లంఘిస్తే క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఇంతకాలం కాపీరైట్‌ గురించి మాట మాట్లాడని వైజయంతి మూవీస్‌(Vyjayanthi Movies) సంస్థ ఆల్‌ ఆఫ్‌ సడన్‌ సినిమాకు సంబంధించి లీగల్‌ పబ్లిక్‌ నోటీస్‌ ఇష్యూ చేయడంలో మర్మేమిటని మూవీ అభిమానులు అనుకుంటున్నారు. ప్రస్తుతం చిరంజీవి సోషియో ఫాంటసీ(Sophia Fantacy) సినిమా చేస్తున్నారు. బింబిసార ఫేమ్‌ వశిష్ట(vasista) దానికి దర్శకుడు. పంచభూతాలు కాన్సెప్ట్‌తో ఆయన కథ రాసుకున్నాడు.

తన సినిమాను జగదేకవీరుడు అతిలోక సుందరితో పోల్చుకున్నాడు. బహుశా ఇక్కడే అశ్వనీదత్‌కు మండి ఉంటుంది. తన సినిమాలోని సీన్లను ఎత్తేసే అవకాశం ఉంటుందేమో అన్న అనుమానం కూడా వచ్చి ఉంటుంది. అందుకే నోటీసు జారీ చేసి ఉంటాడని కొందరు అంటున్నారు. జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాను రామ్‌చరణ్‌తో(Ram Charan) రీమేక్‌ చేయాలని ఉందని ఇప్పటికే చాలాసార్లు చెప్పుకొచ్చాడు అశ్వనీదత్‌.

ఇప్పుడాయనకు రామ్‌చరణ్‌ నుంచి గ్రీన్‌ సిగ్నల్ వచ్చి ఉంటుందని, అందుకే ముందు జాగ్రత్తగా పబ్లిక్‌ నోటీసు ఇచ్చారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఓటీటీ కోసం ఓ పీరియాడిక్‌ బేస్ట్‌ ఫాంటసీ సినిమా సిద్ధమవుతున్నదట! టాలీవుడ్‌కు చెందిన దర్శకుడు ఈ సిరీస్‌ను రూపొందించనున్నారట! ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్టు త్వరలో మొదలు కానుందని సమాచారం. ఈ వెబ్‌ సిరీస్‌ కూడా ఇంచుమించు జగదేకవీరుడు అతిలోక సుందరి తరహాలోనే ఉంటుందట! ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే అశ్వనీదత్‌ ఇలా పబ్లిక్‌ నోటీసులు ఇచ్చి ఉంటారనే టాక్ కూడా వినిపిస్తోంది.

Updated On 12 Oct 2023 2:29 AM GMT
Ehatv

Ehatv

Next Story