సెక్స్, వయొలెన్స్, అన్ని రకాల చెత్తతో వందల వేల వెబ్‌ సిరీస్‌లు ఇంటింటా సెన్సార్‌కి(censor) అతీతంగా విరుచుకుపడ్డాయి. దీనిమీద పెద్ద గందరగోళమే నడిచినా కూడా ఏ రకమైన స్పందనా ప్రభుత్వాలనుంచి గానీ, రెగ్యులేటరీ బాడీలనుంచి గానీ లేకపోవడంతో వాటి వీరవిహారానికి అడ్డూఆపూ లేకుండా యధేచ్ఛగా కొనసాగుతూనే ఉంది.

సెక్స్, వయొలెన్స్, అన్ని రకాల చెత్తతో వందల వేల వెబ్‌ సిరీస్‌లు ఇంటింటా సెన్సార్‌కి(censor) అతీతంగా విరుచుకుపడ్డాయి. దీనిమీద పెద్ద గందరగోళమే నడిచినా కూడా ఏ రకమైన స్పందనా ప్రభుత్వాలనుంచి గానీ, రెగ్యులేటరీ బాడీలనుంచి గానీ లేకపోవడంతో వాటి వీరవిహారానికి అడ్డూఆపూ లేకుండా యధేచ్ఛగా కొనసాగుతూనే ఉంది.

ఇప్పుడు ఓటీటి(OTT) రంగంలో తనదైన ముద్రను చాలా ప్రతిష్టాత్మకంగా వేసుకున్న ఆహా(AHA) కొత్తపుంతలు తొక్కుతూ ముందుకొచ్చింది. ఈసారి ఆహా జర్నలిష్టులమీద కత్తి ఎత్తింది. ఎడాపెడా సినిమాలు తీస్తూ, వంద కోట్ల క్లబ్‌ల పక్కనే పీట వేసుకున్న ప్రముఖ చిత్రనిర్మాణ సంస్ధ పీపుల్స్ మీడియా ‌ఫ్యాక్టరీ(Peoples Media Factory) జర్నలిస్టు పాత్రనే హీరోగా చేసి, డబ్బుకు మీడియా దాసోహమా అనే స్లోగన్‌తో న్యూసెన్స్ అనే వెబ్ సిరీస్‌ను(Web series) నిర్మించి ఆహా ద్వారా విడుదల చేయబోతోంది.

మదనపల్లిలో ఒకనాడెప్పుడో జరిగిన యదార్ధ సంఘటనల ఆధారంగా ప్రియదర్శినిరామ్‌ రాసిన కథతో న్యూసెన్స్ రూపొందింది. డబ్బుకు మీడియా దాసోహమా అనే స్లోగన్‌ లేపిన దుమారంతో ఈ ప్రాజెక్ట్‌ బాగా ప్రాచుర్యాన్ని సంతరించుకుంది. అదే వాళ్ళ టార్గెట్‌ కూడా. ప్రవీణ్‌ దర్శకత్వంలో నవదీప్‌, బిగ్‌ బాస్‌ ఫేం బిందుమాధవి కాంబినేషన్‌లో తయారైన న్యూసెన్స్ వెబ్‌ సిరీస్‌ అలవోకగా మీడియా అటెన్షన్‌ని తనవైపుకు లాక్కుంది. జర్నలిష్టు సంఘాలు కూడా దీనిపైన పెద్ద ఎత్తునే అభ్యంతరాలు వెలిబుచ్చి, విస్తృతంగా అటాక్‌ చేయడానికి పూనుకున్నంత వాతావరణం ప్రస్తుతం నెలకొంది.

శనివారం జరిగిన మీడియా మీట్‌లో దర్శకుడు ప్రవీణ్‌(Praveen), నవదీప్‌(Navdeep), పీపుల్స్ మీడియా ఎగ్జిక్యుటివ్‌ నిర్మాత వివేక్‌(Vivek), ఆహా(aha) సంస్థ నూతన సిఇవోతో పాటూ పలువురు యూనిట్‌ సభ్యులు పాల్గొని న్యూసెన్స్‌లో ఉన్న అసలు విషయాన్ని వివరించడానికి తెగ ప్రయాస పడ్డారు. పాత్రికేయులు కూడా ఏమాత్రం ఉపేక్షించకుండా విమర్శనాత్మకమైన ప్రశ్నలను సంధించి, సాధ్యమైనంత మేరకు న్యూసెన్స్‌ యూనిట్‌ని బెంబేలు ఎత్తించడానికే విశ్వప్రయత్నం చేశారు.

కానీ, న్యూసెన్స్ వెబ్‌ సిరీస్‌లో ప్రధానంగా కథానాయకుడే జర్నలిస్టు కావడం, పరిస్థితులకు ఎదురొడ్డి తానే విధంగా అంతిమ విజయం సాధించడనే ఇతివృత్తమే ఇందులో ముఖ్యమైన కథావస్తువు కాబట్టి, పాత్రికేయులపైన ఉన్న గౌరవం, ఆ వృత్తిలో ఉన్న సాధకబాధకాల పట్ల ఏ విదమైన వివరణ ఇవ్వగలిగాము అనే పాయంట్లు చూస్తే న్యూసెన్స్‌ ద్వారా మీడియాకి ఇచ్చిన ప్రాధాన్యత అర్ధమవుతుందని నవదీప్‌, దర్శకుడు ప్రవీణ్‌ వివరించడానికి శాయశక్తులా ప్రయత్నించారు.
చివరికి కేవలం పబ్లిసిటీ జిమ్మిక్ కోసమే డబ్బుకు మీడియా దాసోహమా అనే స్లోగన్‌ని పెట్టినట్టు నవదీప్‌ మీడియా మీట్‌లో చివరికి ఒప్పుకోవడే ఇందులో కొసమెరుపు.

Updated On 6 May 2023 6:46 AM GMT
Ehatv

Ehatv

Next Story