టాలీవుడ్లో ప్రెజెంటున్న యంగ్ హీరోల్లో ఆయనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకుని.. వరుస చిత్రాలతో దూసుకెళ్తున్నాడు టాలెంటెడ్ హీరో విశ్వక్సేన్ (vishwak sen). కెరీర్ స్టార్టింగ్‌లోనే తనదైన చిత్రాలతో ప్రేక్షకుల మెప్పు పొందిదాడు విశ్వక్.. కొన్ని హిట్లను కూడా ఖాతాలో వేసుకున్నాడు. దీంతో రెట్టింపు ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆయన డైరెక్షన్లో ‘దాస్ కా ధమ్కీ’ అనే మాస్ యాక్షన్ సినిమాతో వచ్చాడు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

‘దాస్ కా ధమ్కీ’ ఫస్టాఫ్ మాత్రం రొటీన్‌గా ఉంటుంది, ఓ చిన్న ట్విస్టుతో ఓ మాదిరిగా అనిపించేలా ఉంది ఈ సినిమా. కానీ సెకాండాఫ్‌కు వచ్చేసరికి మూవీ టెంపో, వరుస ట్విస్టులతో సినిమా ఆసక్తికరంగా సాగుతుంది. ఓవరాల్‌గా ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఇటు విశ్వక్ సేన్ (vishwak sen) ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలుస్తుందంటున్నారు.
ఇక విశ్వక్సేన్ (vishwak sen) టేకింగ్, పర్ఫార్మెన్స్‌కు మంచి మార్కులు పడుతున్నాయి. అలాగే హీరోయిన్ నివేదా పేతురాజ్ (nivetha pethuraj) అందానికి ఆడియన్స్ అంతా ఫిదా అవుతున్నారు. స్క్రీన్‌పై ఆమె చాలా గ్లామర్ గా కనిపించింది. మొత్తానికి సినిమాను విశ్వక్ కాస్త కొత్తదనంగా చూపించాడనే చెప్పాలి. డ్యూయల్ రోల్‌లో విశ్వక్ పర్ఫార్మెన్స్ అదరగొట్టేశాడనే చెప్పాలి. అయితే సినిమాలో కొన్ని లాజిక్ లేని సీన్స్ ఉండటంతో ఆడియన్స్ ను కాస్త ఇబ్బంది పడుతున్నారనే చెప్పాలి.
విశ్వక్సేన్ (vishwak sen)కు ఫ్రెండ్స్‌గా చేసిన ఆది, రంగస్థలం మహేష్ నటనలు చాలా బావున్నాయి. రావు రమేష్, పృధ్విరాజ్, రోహిణి, తరుణ్ భాస్కర్, రజిత, అజయ్, మురళీధర్ గౌడ్, కాదంబరి కిరణ్‌లు ఎప్పటిలానే వాళ్ల నటనతో ఆడియన్స్ ను అలరించారు
ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని బావున్నాయి. ఒక స్టార్ హీరో సినిమా బడ్జెట్ లా సినిమా చూపించారు.
పాజిటివ్: విశ్వసేక్ మార్క్ ఎలిమెంట్స్, లోవిష్ ప్రొడక్షన్ వాల్యూ, రెండు పాటలు
నెగిటివ్: సెకండాఫ్, కన్ఫ్యూజ్ చేసే స్క్రీన్ ప్లే, క్యాన్సర్ డ్రగ్ థ్రెట్