ధనుష్‌(Danush) ఇప్పుడు తమిళ నటుడు కాదు, అంతర్జాతీయ నటుడు. ఎందుకంటే ఆయన సినిమా ప్రయాణం కోలీవుడ్‌(Kollywood) నుంచి హాలీవుడ్‌(Hollywood) వరకు వెళ్లింది కాబట్టి. హిందీలో కూడా ధనుష్‌ సినిమాలు చేశాడు. తెలుగులో చెప్పనే అక్కర్లేదు.

ధనుష్‌(Danush) ఇప్పుడు తమిళ నటుడు కాదు, అంతర్జాతీయ నటుడు. ఎందుకంటే ఆయన సినిమా ప్రయాణం కోలీవుడ్‌(Kollywood) నుంచి హాలీవుడ్‌(Hollywood) వరకు వెళ్లింది కాబట్టి. హిందీలో కూడా ధనుష్‌ సినిమాలు చేశాడు. తెలుగులో చెప్పనే అక్కర్లేదు. ప్రస్తుతం ధనుష్‌ కెప్టెన్‌ మిల్లర్‌(Captain Miller) అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రం కోసం ధనుష్‌ జుట్టును పెంచాడు, గడ్డాన్నీ పెంచాడు. సత్యజ్యోతి ఫిలింస్‌(Satya Jyoti Films) సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమా తర్వాత ధనుష్‌ నటించబోయే సినిమా ఏమిటా అన్నది క్యూరియాసిటీగా మారింది. చాలా మంది దర్శక నిర్మాతలు ఆయన కాల్షీట్ల కోసం కాచుకూర్చున్నారు. ఇప్పటి వరకు 48 సినిమాలలో నటించిన ధనుష్‌కు కెప్టెన్‌ మిల్లర్‌ 49వ సినిమా అవుతుంది.

50వ సినిమాపైనే అందరికీ ఆసక్తి పెరిగింది. తాజాగా అందుకున్న సమాచారం ప్రకారం 50వ సినిమాకు ఆయనే దర్శకత్వం వహిస్తాడట. ఇంతకు ముందు పా.పాండి(Pa Paandi) అనే సినిమాను స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించాడు. ఈ సినిమా 2017 ఏప్రిల్‌ 14 తమిళ సంవత్సరాది అయిన పుత్తాండుకు విడుదలయ్యింది. మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు దర్శకత్వం వహించబోతున్న సినిమాను సన్‌ పిక్చర్స్‌ వారు నిర్మిస్తున్నారు. సుమారు వంద కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో రూపొందించబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఇందులో ధనుష్‌తో పాటు విష్ణువిశాల్‌(Vishnu Vishal), కాళిదాస్‌ జయరామ్‌(Kalidas Jayaram), దుషారా(Dhushara) ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఎస్‌జే.సూర్య(SJ.surya), సందీప్‌కిషన్‌(Sandeep kishan) ధనుష్‌కు సోదరులుగా నటించనున్నట్లు తాజాగా అందిన సమాచారం. ఉత్తర చైన్నె నేపథ్యంలో సాగే గ్యాంగ్‌స్టర్‌ కథాంశంగా సినిమాను రూపొందిస్తున్నారట. ఈ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Updated On 25 May 2023 12:50 AM GMT
Ehatv

Ehatv

Next Story