విరూపాక్ష (Virupaksha) చిత్రం బాక్సాఫీసు దగ్గర మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej), సంయుక్త (Samyuktha) జంటగా నటించిన హారర్, థ్రిల్లర్ చిత్రం సక్సెస్ ఫుల్‌గా ఆడుతోంది. బాక్సాఫీసు వద్ద అద్భుతమైన రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఈ సినిమాకు సుకుమార్ దగ్గర అసిస్టెంట్‌గా వర్క్ చేసిన కార్తీక్ వర్మ దండు (Karthik Varma Dandu) దర్శకత్వం వహించారు.
విరూపాక్ష (Virupaksha) చిత్రం బాక్సాఫీసు దగ్గర మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej), సంయుక్త (Samyuktha) జంటగా నటించిన హారర్, థ్రిల్లర్ చిత్రం సక్సెస్ ఫుల్‌గా ఆడుతోంది. బాక్సాఫీసు వద్ద అద్భుతమైన రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఈ సినిమాకు సుకుమార్ దగ్గర అసిస్టెంట్‌గా వర్క్ చేసిన కార్తీక్ వర్మ దండు (Karthik Varma Dandu) దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకొచ్చింది. సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతూ ఈ వీక్‌ను కంప్లీట్ చేసుకోబోతోంది. మొదటి రోజు 7.4 కోట్లు, రెండో రోజు 9.15 కోట్లు, మూడో రోజు 9.50 కోట్ల వసూళ్లను రాబట్టింది.
విరూపాక్ష సినిమా క్రిటిక్స్ నుంచి మొదలు పెడితే ఆడియన్స్ వరకు అందరినీ ఆకర్షించింది. ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 55 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిందంటున్నారు సినీ విశ్లేషకులు. ఇక మొదటి మంగళవారం నాడు 5 కోట్ల వరకు వసూళ్ల రాబట్టడంతోపాటు చాలా ప్రాంతాల్లో 25 శాతం నుంచి 30 శాతం వరకు ఆక్యుపెన్సీని సాధించిందట ఈ చిత్రం. నాలుగు రోజుల్లోనే 24 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్‌ను రాబట్టి, బ్రేక్ ఈవెన్ (Break Even) దాటేసి, ఇప్పుడు భారీ లాభాలను తెచ్చిపెడుతుందని టాక్ వినిపిస్తోంది.
ఇక బాక్సాఫీస్ దగ్గర వసూళ్లతో దూసుకెళ్తున్న ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియాగా రిలీజ్ చేసేందుకు చిత్ర నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఐదు భాషల్లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర (Sri Venkateswara Cine Chitra) బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించగా.. కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించారు. ఇందులో సాయి ధరమ్ తేజ్, సంయుక్త, సునీల్, రాజీవ్ కనకాల, బ్రహ్మాజీ ముఖ్యపాత్రల్లో నటించారు. అయితే ఈ చిత్రం బాలీవుడ్‌లోనూ రిలీజవుతున్న నేపథ్యంలో.. కాంతారా (kantara), కార్తికేయ2 (Karthikeya2) చిత్రాలు విజయం సాధించినంత, ఈ చిత్రం బాలీవుడ్‌పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి మరి.