భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ, జూనియర్ ఎన్టీఆర్ ఒక గొప్ప పని కోసం చేతులు

భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ, జూనియర్ ఎన్టీఆర్ ఒక గొప్ప పని కోసం చేతులు కలిపారు. ఎన్‌డిటివి హోస్ట్ చేస్తున్న ‘రోడ్ అండ్ ఆల్కహాల్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్’ ద్వారా ఇద్దరూ తాగి డ్రైవింగ్ చేయడం వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన కల్పించడానికి సిద్ధమయ్యారు. ఈ సమయంలో మీడియాతో మాట్లాడిన విరాట్ కోహ్లీ తన అభిమాన టాలీవుడ్ హీరో ఎవరో చెప్పుకొచ్చాడు. విరాట్ కోహ్లి మాట్లాడుతూ.. ‘‘తెలుగు హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ నాకు బెస్ట్ ఫ్రెండ్. RRRలో ఎన్టీఆర్ నటనను వర్ణించడానికి మాటలు చాలవు. ఆస్కార్‌ లభించిందని తెలియగానే ‘నాటు, నాటు’ చేయడం ద్వారా నా సంతోషాన్ని వ్యక్తం చేశాను" అని తెలిపాడు.

ఈ కార్యక్రమం వల్ల మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల సంభవించే ప్రమాదాల సంఖ్యపై సమాచారం ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకుంది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఒకచోట చేర్చడం ద్వారా, NDTV సందేశాన్ని విస్తరించాలని, ప్రజల మీద ప్రభావాన్ని సృష్టించాలని భావిస్తోంది. 'రోడ్ అండ్ ఆల్కహాల్ అవేర్‌నెస్ ప్రోగ్రాం' బ్రాండ్ అంబాసిడర్‌లుగా, కోహ్లీ, జూనియర్ ఎన్టీఆర్, ఇతర స్టార్‌ లు ఉన్నారు. ఈ సెలెబ్రిటీలు మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల కలిగే నష్టాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడంలో కీలక పాత్ర పోషించనున్నారు.

Updated On 26 May 2024 6:42 AM GMT
Yagnik

Yagnik

Next Story