భారతీయులలో కొందరు ధనవంతులు వేరే దేశాల్లో స్థిరపడటం మనం చూస్తున్నాం. గత పదేళ్లలో ఇండియన్ సిటిజన్‌షిప్‌ను వదిలేసుకున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉందని గణాంకాలు చెబుతున్నాయి. బాగా డబ్బున్న వారిలో చాలా మంది ఇక్కడే ఉండిపోవడానికి కారణాలు ఉన్నాయి. రాజకీయాల్లో రాణించాలనే కోరిక కావచ్చు. ఇంకా డబ్బు సంపాదించాలనే యావ కావచ్చు. సంపాదించుకున్నది చాల్లే.. ఇక ప్రశాంత జీవితాన్ని గడిపేద్దామన్న భావన చాలా తక్కువ మందిలోనే ఉంటుంది.
భారతీయులలో కొందరు ధనవంతులు వేరే దేశాల్లో స్థిరపడటం మనం చూస్తున్నాం. గత పదేళ్లలో ఇండియన్ సిటిజన్‌షిప్‌ను వదిలేసుకున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉందని గణాంకాలు చెబుతున్నాయి. బాగా డబ్బున్న వారిలో చాలా మంది ఇక్కడే ఉండిపోవడానికి కారణాలు ఉన్నాయి. రాజకీయాల్లో రాణించాలనే కోరిక కావచ్చు. ఇంకా డబ్బు సంపాదించాలనే యావ కావచ్చు. సంపాదించుకున్నది చాల్లే.. ఇక ప్రశాంత జీవితాన్ని గడిపేద్దామన్న భావన చాలా తక్కువ మందిలోనే ఉంటుంది. ఆ లిస్టులో టీమిండియా క్రికెట్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) కూడా ఉన్నారనే వార్త వినిపిస్తోంది. విరాట్ కోహ్లీ, ఆయన భార్య అనుష్క(Anushka sharma) బ్రిటన్‌లో(Britain) సెటిలవ్వాలని అనుకుంటున్నారట! ఇప్పటికే వారు అక్కడ సెటిలైపోయారని కొందరు అంటున్నారు. ఇటీవల బ్రిటన్‌లోనే అనుష్క శర్మ తమ రెండో బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే! ఈ కారణంగానే స్వదేశంలో ఇంగ్లాండ్‌ఓ జరిగిన టెస్ట్ సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరమయ్యాడు. త్వరలో జరగబోయే ఐపీఎల్(IPL) టోర్నమెంట్ కోసం విరాట్ కోహ్లి ఇండియాకు రాబోతున్నాడు. విరాట్ మహా అయితే మరో రెండు మూడేళ్లు క్రికెట్ ఆడతాడమో! వయసు సహకరించాలి కదా! పైగా ప్రస్తుతం టీమిండియాలో ఉన్నవారంతా యంగ్‌స్టర్లే! ఐపీఎల్ వంటి టోర్నమెంట్లలో విరాట్ కోహ్లీ ఆడితే ఆడవచ్చుగాక, అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంకొన్నేళ్లు కొనసాగడం మాత్రం కష్టమే. ఈ నేపథ్యంలోనే విరాట్-అనుష్క కుటుంబం పూర్తిగా బ్రిటన్‌లోనే సెటిలవ్వాలని అనుకుంటోంది. చాలా కాలంగా అనుష్క శర్మ బ్రిటన్‌లోనే ఉంటున్నారు. ఆమె ఇండియాలో కనిపించి చాలా కాలం అవుతోంది. తనకు ఉన్న ఆస్తులతో విరాట్ ఈజీగా బ్రిటన్‌లో సెటిల్ కావచ్చు. ఆ దేశ పౌరసత్వం కూడా ఈజీగానే వచ్చేస్తుంది. అక్కడ పెట్టుబడులను పెడితే ఇంకాస్త సులభంగానే పౌరసత్వం దొరుకుతుంది. తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని విరాట్-అనుష్కలు ఈ నిర్ణయానికి వచ్చి ఉంటారు. చాలా మంది క్రికెటర్లు బ్రిటన్‌లో సెటిలయ్యారు. వెస్టిండీస్‌కు చెందిన గార్డన్ గ్రీనిడ్జ్ అక్కడే ఉంటారు. పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు కూడా బ్రిటన్‌లోనే స్థిరపడ్డారు.