బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ఖాన్‌(Salmaan) గురించి అతడి క్లోజ్ ఫ్రెండ్‌ విందు దారాసింగ్‌(Vindu Darasingh) కొన్ని రహస్యాలు చెప్పాడు. వీరిద్దరు కాలేజీ డేస్‌ నుంచే మంచి ఫ్రెండ్స్‌.. ఇప్పటికీ వీరి స్నేహం అలాగే కొనసాగుతోంది. లేటెస్ట్‌గా సల్మాన్‌ గురించి కొన్ని సీక్రెట్స్‌ను విందు దారాసింగ్‌ బయటపెట్టాడు. తన శరీరాకృతి చూసిన తర్వాతే సల్మాన్‌ఖాన్‌ ఎక్కువ ఎక్సర్‌సైజ్‌లు చేయడం మొదలు పెట్టాడని చెప్పిన విందు అతడు చాలా ఎక్కువసేపు జిమ్‌లోనే(Gym) గడుపుతాడని తెలిపాడు.

బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ఖాన్‌(Salmaan) గురించి అతడి క్లోజ్ ఫ్రెండ్‌ విందు దారాసింగ్‌(Vindu Darasingh) కొన్ని రహస్యాలు చెప్పాడు. వీరిద్దరు కాలేజీ డేస్‌ నుంచే మంచి ఫ్రెండ్స్‌.. ఇప్పటికీ వీరి స్నేహం అలాగే కొనసాగుతోంది. లేటెస్ట్‌గా సల్మాన్‌ గురించి కొన్ని సీక్రెట్స్‌ను విందు దారాసింగ్‌ బయటపెట్టాడు. తన శరీరాకృతి చూసిన తర్వాతే సల్మాన్‌ఖాన్‌ ఎక్కువ ఎక్సర్‌సైజ్‌లు చేయడం మొదలు పెట్టాడని చెప్పిన విందు అతడు చాలా ఎక్కువసేపు జిమ్‌లోనే(Gym) గడుపుతాడని తెలిపాడు. తిండి విషయంలోనూ అంతేనట! పందిలా(Pig) తింటూ కుక్కలా(dog) ఎక్సర్‌సైజ్‌(Exercise) చేస్తాడని వివరించాడు. 'సల్మాన్‌ఖాన్‌ భోజన ప్రియుడు(Foodie). చాలా ఎక్కువ తింటాడు. తిన్నదంతా ఎక్కడికి పోతుందనే డౌట్‌ నాకొచ్చేది. అదే విషయాన్ని సల్మాన్‌ను అడిగితే ఎక్సర్‌సైజ్‌ ద్వారా తిన్నదంతా కరిగించేస్తానని తెలిపాడు. సల్మాన్‌ చాలా అద్భుతమైన వ్యక్తి. అతడంటే నాకు ఎంతో ఇష్టం. మనసు చాలా మంచిది. సహాయం చేసే గుణం కూడా ఉంది' అని విందు దారాసింగ్‌ చెప్పుకొచ్చాడు. సల్మాన్‌ తండ్రి ప్రముఖ రచయిత సలీమ్‌ఖాన్‌. ఒకప్పుడు సక్సెస్‌ఫుల్‌ జంట రచయితలుగా పేరుగాంచిన సలీమ్-జావెద్‌లలో సలీమ్‌ ఇతడే!ప్రతిరోజూ సల్మాన్‌కు డబ్బులు ఇచ్చేది సలీమ్‌ ఖానే! తను సంపాదించిదంతా తండ్రికే ఇచ్చేస్తాడు సల్మాన్‌. ఇప్పటికే తన పాకెట్‌మనీని తండ్రి దగ్గర నుంచే తీసుకుంటాడు. ఆ డబ్బును ఇంట్లో పనివారికి ఇచ్చేవాడు సల్మాన్‌. 50 వేల రూపాయలిచ్చినా, లక్ష రూపాయలు ఇచ్చినా దాన్ని పేదలకు దానం చేస్తాడు. నెలకు పాతిక నుంచి 30 లక్షల రూపాయల వరకు ఇలా దానధర్మాలకు వెచ్చిస్తుంటాడు' అని విందు దారాసింగ్‌ చెప్పుకొచ్చాడు.

Updated On 9 March 2024 3:25 AM GMT
Ehatv

Ehatv

Next Story