బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘విక్రమార్కుడు’( vikramarkudu)లో రవితేజ ద్విపాత్రాభినయం చేశాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. మధ్యప్రదేశ్‌(Madya Pradesh)లోని చంబల్ (Chambal)ప్రాంతంలో జరిగిన కథను సినిమాగా తెరకెక్కించారు. ఈ సినిమాలో రవితేజ (Ravi teja)కూతురుగా నటించిన చిన్నారి గుర్తుందా? ‘మమ్మీ పాట వింటే నాకు నిద్ర వస్తుంది నాన్న’ అని అంటూ అమాయకంగా చెప్పిన ఆ చిన్నారి ప్రస్తుతం ఏం చేస్తుందో తెలుసా

చైల్డ్ ఆర్టిస్టులుగా సినీ రంగ ప్రవేశం చేసిన వారు చాలా మంది ఉన్నారు. కొందరు ఒక్క సినిమా తోనే స్టార్స్‌గా మారితే.. మరికొందరు కొన్ని సినిమాలవరకే పరిమితం అవుతారు . ఒక్క సినిమాలో కనిపించి కనిపించకుండా పోయిన వారుకూడా ఉంటారు .ఒక సూపర్ హిట్ సినిమాతో పరిచయమై అందరికి గుర్తుండిపోయే సినిమా చేసిన ఒక చైల్డ్ ఆర్టిస్ట్ గురించి తెలుసుకుందాం .

బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘విక్రమార్కుడు’( vikramarkudu)లో రవితేజ ద్విపాత్రాభినయం చేశాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. మధ్యప్రదేశ్‌(Madya Pradesh)లోని చంబల్ (Chambal)ప్రాంతంలో జరిగిన కథను సినిమాగా తెరకెక్కించారు. ఈ సినిమాలో రవితేజ (Ravi teja)కూతురుగా నటించిన చిన్నారి గుర్తుందా? ‘మమ్మీ పాట వింటే నాకు నిద్ర వస్తుంది నాన్న’ అని అంటూ అమాయకంగా చెప్పిన ఆ చిన్నారి ప్రస్తుతం ఏం చేస్తుందో తెలుసా?

విక్రమార్కుడు సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్(child artist) నేహా(Neha) విక్రమార్కుడు సినిమాలో కాకుండా చాలా సినిమాల్లో నటించింది. విక్రమార్కుడి సినిమాలో రవితేజ కూతురిగా అమాయకమైన పాత్రలో తనదైన నటనతో మెప్పించి మంచి పేరుని సంపాదించుకుంది . ఈ సినిమాలో చిన్నారి నటనకు ఎంతోమంది ప్రశంసలు దక్కించుకుంది . అలాగే అనసూయ, రామ, ఆది విష్ణు, రక్ష, సర్కార్ చిత్రాల్లోనూ నేహా నటించింది.

అయితే ‘విక్రమార్కుడు’లో(vikramarkudu) నటించిన ఈ చిన్నారి నేహా అమెరికాలోని(America) ఫ్లోరిడాలో (Florida)జన్మించింది. కానీ పాప తల్లిదండ్రులు హైదరాబాద్(Hyderabad) వచ్చి స్థిరపడ్డారు. ఆమె తల్లిదండ్రులు ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందినవారు. నేహా ఇప్పటికి పదేళ్లకు పైగా సినిమాల్లో నటించలేదు. అయితే ప్రస్తుతం ఆమె సినిమాల కంటే చదువు ,కెరీర్ పైనే ఎక్కువ దృష్టి పెట్టినట్లు సమాచారం. ఇటీవలే తను ఎంబీఏ (MBA)కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది.సినిమాల్లోకి రావాలనే ఆలోచన మాత్రం ప్రస్తుతానికి నేహాకు లేనట్లు సమాచారం .భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తే అప్పుడు తప్పకుండ ఆలోచిస్తానని చెప్పింది .

Updated On 15 April 2023 6:54 AM GMT
rj sanju

rj sanju

Next Story