దర్శకుడు పా.రంజిత్‌(Pa. Ranjith) రూపొందిస్తున్న తాజా చిత్రం తంగలాన్‌(Thangalan).. ఈ వినూత్న కథా చిత్రంలో విక్రమ్‌(Vikram) హీరోగా నటిస్తున్నారు. మాళవికా మోహన్‌(Malavika Moham) హీరోయిన్‌గా నటిస్తున్నారు. పార్వతి, పశుపతి, డేనియల్‌ కాల్టకిరోన్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను స్టూడియో గ్రీన్‌(Studios Green) పతాకంపై కేఈ జ్ఞానవేల్‌ రాజా నిర్మిస్తున్నారు.

దర్శకుడు పా.రంజిత్‌(Pa. Ranjith) రూపొందిస్తున్న తాజా చిత్రం తంగలాన్‌(Thangalan).. ఈ వినూత్న కథా చిత్రంలో విక్రమ్‌(Vikram) హీరోగా నటిస్తున్నారు. మాళవికా మోహన్‌(Malavika Moham) హీరోయిన్‌గా నటిస్తున్నారు. పార్వతి, పశుపతి, డేనియల్‌ కాల్టకిరోన్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను స్టూడియో గ్రీన్‌(Studios Green) పతాకంపై కేఈ జ్ఞానవేల్‌ రాజా నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ ముగింపు దశకు చేరుకున్న సమయలో హీరో విక్రమ్‌ అనూహ్యంగా ప్రమాదానికి గురయ్యారు. దాంతో షూటింగ్‌కు అంతరాయం ఏర్పడింది. మరో 12 రోజుల షూటింగ్‌ను నిర్వహిస్తే తంగలాన్‌ సినిమా పూర్తవుతుందని దర్శకుడు పా.రంజిత్‌ తెలిపారు. మొన్న శనివారం నుంచి షూటింగ్‌ మళ్లీ మొదలయ్యింది.

వైద్య చికిత్స, విశ్రాంతి తర్వాత విక్రమ్‌ మళ్లీ ఫుల్‌ ఎనర్జీతో షూటింగ్‌లో పాల్గొంటున్నారు. సినిమా షూటింగ్‌ మళ్లీ ప్రారంభమయ్యిందన్న విషయాన్ని హీరోయిన్‌ మాళవిక మోహన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో(Instagram) తెలిపారు. తాను ఇప్పుడు చెన్నైలో ఉన్నానని, విక్రమ్‌తో కలిసి తంగలాన్‌ చిత్ర షూటింగ్‌లో పాల్గొన్నానని అందులో మాళవిక మోహన్‌ పేర్కొన్నారు. మరో 20 రోజులు ఇక్కడే ఉంటానని అన్నారు. విక్రమ్‌ ఇందులో డీ గ్లామరస్‌ రోల్‌లో నటిస్తున్నారు. కోలార్‌ గోల్డ్ ఫీల్డ్‌ బ్యాక్‌డ్రాప్‌లో, వాస్తవ సంఘటనల ఆధారంగా, పూర్తి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. జీవీ ప్రకాశ్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను జరుపుకుంటోంది. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

Updated On 19 Jun 2023 2:34 AM GMT
Ehatv

Ehatv

Next Story